Krrish 4 movie : ఎన్నో ఏళ్ల కిందట వచ్చి క్రిష్ మూవీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని కూడా మంచి హిట్ అయ్యాయి. ఈ క్రిష్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు పార్ట్‌లు ఉన్నాయి.ఈ మూడు పార్ట్‌లు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో నాలుగో సినిమా కూడా రాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటించిన విషయం తెలిసిందే. ఇతని యాక్టింగ్‌తో సినిమా మూడు పార్ట్‌లు కూడా హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ మొదటిసారి డైరెక్టర్‌గా మారనున్నాడు. 2003లో కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు రాబోతున్న నాలుగో మూవీని హృతిక్ రోషన్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేయనున్నట్లు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ వెల్లడించాడు. 25 ఏళ్ల కిందట హృతిక్ రోషన్‌ను హీరోగా, తనని తాను డైరెక్టర్‌గా పరిచయం చేశానని తెలిపాడు. ఇప్పుడు ఆదిత్య చోప్రాను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. క్రిష్ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే యాక్టింగ్ పీక్స్‌లో ఉంటుంది. దీంతో ఇప్పటి జనరేషన్‌లో ఉన్నవారు కూడా ఈ క్రిష్ మూవీని చూసి ఫ్యాన్ అయిపోతున్నారు. దీంతో ఈ ఫ్రాంచైజీలో మూవీ ఎప్పుడు వస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే క్రిష్ 3 మూవీ దాదాపుగా 12 ఏళ్ల క్రితం వచ్చింది. 2013లో క్రిష్ 3 మూవీ రిలీజ్ కాగా.. ఇప్పటి వరకు నెక్ట్స్ పార్ట్ కోసం ఎంతగానే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.
Also Read : ప్రేమ, పెళ్లి…భర్త మరో హీరోయిన్ తో ఎఫైర్.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటి..
డైరెక్టర్‌గా హృతిక్ రోషన్ చేయడంతో సినిమా ఇంకో అద్భుతాన్ని సృష్టిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప 2 రికార్డు ఈ సినిమాతో బ్రేక్ కావడం ఖాయమని అంటున్నారు. అయితే క్రిష్ 4 మూవీలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ రోల్‌లో ఉంటాడా? లేకపోతే ఇంకా ఎవరైనా స్టార్ హీరోని తీసుకుంటారా? అనే విషయాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదటి సారి 2003లో ఏలియన్ మూవీగా కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. ఇందులో హృతిక్ రోషన్ డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. ఓ యువకుడిని ఏలియన్ ఎలా మార్చేసిందనే దాన్ని సినిమాలో చూపించారు. ఇందులో రోహిత్ మెహ్రా (హృతిక్), నిషా (ప్రీతి జింటా)లకు క్రిష్ణా అనే అబ్బాయి పుట్టినట్లుగా క్రియేట్ చేసి ఈ క్రిష్ ఫ్రాంఛైజీని స్టార్ట్ చేశారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత 2006లో క్రిష్ మూవీ రిలీజైంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హృతిక్ రోషన్ సరసన నటించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తీయగా.. రూ.126 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2013లో క్రిష్ 3 రాగా.. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత క్రిష్ 4 మూవీ వస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.