Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్, నటి ఐశ్వరాయ్ తో విడిపోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అభిషేక్ బచ్చన్ స్పందించారు. సోషల్ మీడియా ప్రచారాలకు తాము అంతగా ప్రాధాన్యం ఇవ్వమన్నారు. ఆన్ లైన్ వేదికగా వచ్చే పోస్టులు, కామెంట్స్ తమపై ప్రభావం చూపించవన్నారు. వర్క్ కు సంబంధించిన చాలా విషయాల గురించి మా కుటుంబమంతా చర్చించుకుంటాం. అలా దానికే ప్రాదాన్యం ఇవ్వం. వేరే విషయాల గురించీ మేము మాట్లాడుకుంటాం. అని అభిషేక్ బచ్చన్ అన్నాడు.