Dhoom 4: మన తెలుగు హీరోలను బాలీవుడ్ దర్శకులు అసలు హ్యాండిల్ చెయ్యలేరు అని రీసెంట్ గా విడుదలైన సినిమాలు రుజువు చేశాయి. రామ్ చరణ్(Global Star Ram Charan) ‘తుఫాన్’ చిత్రం తో, ప్రభాస్(Rebel Star Prabhas) ‘ఆదిపురుష్’ చిత్రం తో, అదే విధంగా రీసెంట్ ఎన్టీఆర్(Junior NTR) ‘వార్ 2′(War 2 Movie) చిత్రంతో బాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్మి చేతులు కాల్చుకున్నారు. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన ‘వార్ 2’ లో అయితే ఎన్టీఆర్ క్యారక్టర్ ని హృతిక్ రోషన్ పక్కన తేలిపోయే రేంజ్ లో తెరకెక్కించాడు ఆ చిత్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇదే అభిమానులకు మింగుడుపడని విషయం. సినిమా అన్నాక హిట్, ఫ్లాప్ సహజమే, కానీ అభిమానులు తమ హీరోలను తక్కువ చేసి చూపిస్తే అసలు చూడలేరు. ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ క్యారక్టర్ బాగాలేకపోవడం వల్లే.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
దీనిని ఉదాహరణ గా తీసుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ దర్శకులతో పని చేయడానికి ఇష్టం చూపించడం లేదు. మన టాలీవుడ్ మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. మన స్టార్ హీరోల స్టార్ పవర్ బాలీవుడ్ హీరోలకంటే ఎక్కువ. మనం ఎందుకు వాళ్ళ ముందు తగ్గాలి అనే భావన లో ఉన్నారు. అందులో భాగంగానే యాష్ రాజ్(Yash Raj Films) సంస్థ ఒక ప్రముఖ యంగ్ హీరో ని ‘ధూమ్ 4’ చిత్రం లో రణబీర్ కపూర్ తో పాటు క్యాస్టింగ్ చెయ్యాలని తెగ ప్రయత్నిస్తున్నారట. కానీ ఆ యంగ్ హీరో మాత్రం ససేమీరా నో చెప్పినట్టు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). చాలా కాలం నుండి ఈయన డేట్స్ కోసం యాష్ రాజ్ సంస్థ ప్రయత్నం చేస్తూనే ఉంది. ముందుగా ‘వార్ 2’ కోసం విజయ్ దేవరకొండ నే సంప్రదించారట, కానీ ఆయన నో చెప్పాడు.
ఇప్పుడు ‘ధూమ్ 4’ చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేశాడు. కారణం ఇది పూర్తి స్థాయి నెగిటివ్ క్యారక్టర్ అవ్వడం వల్లే రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట. అంత అవసరం లేదని, ప్రస్తుతం తన డేట్స్ అసలు ఖాళీ గా లేవని చెప్పి పంపేసాడట. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసి చాలా తెలివైన పని చేశాడంటూ మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఇలా ‘వార్ 2’ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఉండుంటే బాగుండేదని, ఆయన స్థాయికి తగ్గ క్యారక్టర్ అసలు చేయలేదని అభిమానులు బాధపడుతున్నారు. భవిష్యత్తులో కూడా మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.