Mahesh Babu Dhoom 4: మన దేశం లో ధూమ్(Dhoom) సిరీస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాన్ అబ్రహం తో మొదలైన ఈ సంచలనాత్మక సిరీస్ ఆ తర్వాత హృతిక్ రోషన్ తో, అమీర్ ఖాన్ తో కొనసాగింది. అయితే ‘ధూమ్ 3′(Dhoom 3) తర్వాత మళ్ళీ ‘ధూమ్ 4′(Dhoom 4) ఎప్పుడు మొదలు అవుతుంది అనే ప్రస్తావన ఇప్పటి వరకు రాలేదు. అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్ 3’ 2013 వ సంవత్సరం లో విడుదలైంది. అంటే దాదాపుగా 12 ఏళ్ళు దాటింది. ‘ధూమ్’ మరియు ‘ధూమ్ 2’ మధ్య కేవలం రెండేళ్ల గ్యాప్ మాత్రమే వచ్చింది. కానీ ‘ధూమ్ 2′(Dhoom 2) మరియు ‘ధూమ్ 3’ కి మధ్య ఆరేళ్ళ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ‘ధూమ్ 4’ కి ఏకంగా 12 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. అయితే ‘ధూమ్ 4’ హీరో రోల్ ఎవరు చేస్తారు అనే దానిపై ఇప్పటి వరకు అనేక పేర్లు వినిపించాయి.
ముందుగా ఈ చిత్రంలో ప్రభాస్(Rebel star Prabhas) నటిస్తాడని రూమర్ వచ్చింది, కానీ ఆయన ఇందులో నటించడం లేదని తర్వాత తెలిసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రామ్ చరణ్(Global Star Ram Charan) పేర్లు కూడా వినిపించాయి, కానీ ఏది ఖరారు కాలేదు. రీసెంట్ గానే రణబీర్ కపూర్(Ranbir Kapoor), రణవీర్ సింగ్(Ranveer Singh) వంటి హీరోలు కూడా ఈ ‘ధూమ్ 4’ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపించింది, ఒక పక్క రూమర్ ప్రచారం లో ఉండగానే మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. రీసెంట్ గానే యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ని కలిసి ‘ధూమ్ 4’ కాన్సెప్ట్ ని వివరించారట. మహేష్ కి కూడా ఆ కాన్సెప్ట్ బాగా నచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గా ఇటీవలే ఖరారు అయ్యాడు.
ఇక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ లో ఇంతకు ముందు సినిమాల్లో కనిపించిన అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా లే ఇందులో కూడా కనిపిస్తారట. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే రెండు ప్రధాన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మూడవ షెడ్యూల్ ని అతి త్వరలోనే ప్రారంభించుకోనుంది. వేసవి సెలవలు ముగియడం తో మహేష్ బాబు ఈ నెల నుండి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నాడట. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు ‘ధూమ్ 4’ షిఫ్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది. మరోపక్క మహేష్ కోసం సందీప్ వంగ, బుచ్చి బాబు వంటి వారు కూడా ఎదురు చూస్తున్నారు.