HomeNewsFertility Problems: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే!

Fertility Problems: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే!

Fertility Problems: మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, పురుషులు అనే కాకుండా ఇద్దరిలో కూడా పిల్లలు పుట్టే సమస్య రోజురోజుకీ పెరుగుతుంది. పూర్వ కాలంలో అయితే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ప్రెగ్నెన్సీ విషయంలో సమస్యలు వచ్చేవి కావు. కానీ ఈ రోజుల్లో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వీటికి తోడు మద్యం, ధూమపానం వంటివి సేవించడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే కొందరు ఆలస్యంగా వివాహం చేసుకోవడం కూడా పిల్లలు పుట్టరు. ఇలాంటి కారణాల వల్ల కూడా పిల్లలు పుట్టరు. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం సరిగ్గా చూసుకోరు. దీంతో పిల్లలు పుట్టే అవకాశాలు కోల్పోతున్నారు. తెలిసో తెలియక కొందరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. వాటివల్ల సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఏయే తప్పుల వల్ల పిల్లలు పుట్టరో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ఫాస్ట్ ఫుడ్
ఈ రోజుల్లో అందరూ కూడా బయట ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. ఇంట్లో చేసిన ఫుడ్ టేస్ట్ లేకపోవడం లేదా బయట ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. అందులోనూ ఫాస్ట్‌పుడ్‌కి ఈ మధ్య ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. సమయం సందర్భం లేకుండా ఎక్కువగా తింటున్నారు. వీటిని తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.

బరువు పెరుగుట
బయట ఫుడ్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. దీంతో కొందరు ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎక్కువ బరువు ఉన్నవారిలో 81 శాతం వరకు వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అధిక బరువు ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. అమ్మాయిలు కూడా బరువు ఎక్కువగా ఉంటే గర్భం దాల్చడం కష్టం అవుతుంది. కాబట్టి రోజూ వ్యాయామం, యోగా వంటివి చేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు. దీంతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి.

ల్యాప్‌టాప్
ప్రస్తుతం రోజుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోని చేసే వర్క్‌లు ఎక్కువగా చేస్తున్నారు. కనీసం వ్యాయామం కూడా చేయడం లేదు. బాడీకి శారీరక శ్రమ లేకపోయిన కూడా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మద్యపానం
మద్యం సేవించడం, ధూమపానం తాగడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగితే పురుషుల్లో వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. అలాగే మహిళలు కూడా మద్యం సేవిస్తే గర్భం దాల్చడం చాలా కష్టం అవుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper