Fertility problems: భారతదేశం మొన్నటి వరకు అత్యధిక జనాభా కలిగిన దేశం. జనాభా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ పథకం అమలు చేశారు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది సంతానం కోసం ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు సంతానం లేక దత్తత తీసుకుంటున్నారు. ఇంకొందరు అర్థం ద్వారా పిల్లలను కనాల్సి వస్తుంది. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఐదు నుంచి పదిమంది కి జన్మనిచ్చిన వారు ఇప్పుడు ఒకరిని కనడానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇలా? ఏం జరుగుతోంది?
కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొన్ని పనులు సులువుగా చేస్తున్నారు. ఈ క్రమంలో శారీరక శ్రమ స్థానంలో కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారి సంఖ్య ఎక్కువ అయిపోయింది. అయితే నేటి కాలం యువత కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో పెళ్లి విషయం మర్చిపోతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్న కూడా సంతానంను వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా వేసిన తర్వాత వయసు గడిచిపోయి వ్యక్తుల్లో సంతానం కలిగే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా పిల్లలు పుట్టడం లేదు.
ఒక పురుషుడు 25 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం 30 ఏళ్లు దాటనిది ఎవరు వివాహం చేసుకోవడం లేదు. ఒక యువతి 30 ఏళ్లలోపు వివాహం చేసుకోవాలి. కానీ 35 ఏళ్లు వచ్చినా కొందరికి పెళ్లి కావడం లేదు. ఇలా వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నా.. ఫలితం ఉండడం లేదు. ఎందుకంటే పురుషుల్లో 30 ఏళ్లలోపే శుక్రకణాల సంఖ్య అనుకున్న స్థాయిలో ఉంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత వారిలో వెర్టిలిటీ కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. మహిళల్లో సంతానం కలిగే సమస్య 32 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువవుతుంది. అయితే చాలామంది వయసు ఎక్కువ అయిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు. అయితే 25 నుంచి 30 ఏళ్ల లోపు కెరీర్ ధ్యాసలో పడి స్ట్రెస్ కు గురవుతున్నారు. ఈ క్రమంలో పురుషులు మద్యం, ధ్రువపానం వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఈ కారణంగా కూడా వారిలో సంతాన సమస్యలు వస్తుంటాయి. అలాగే మహిళలు 25 నుంచి 32 ఏళ్ల లోపు స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మహిళల్లో రజస్వల సమస్యలు.. థైరాయిడ్ వంటివి అదనంగా చేరుతున్నాయి. థైరాయిడ్ ఎక్కువగా ఉన్నవారిలో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తూ పిల్లలని పట్టించుకోకపోవడం.. వారు తిరిగి పెద్దయ్యాక వివాహ వ్యవస్థను పట్టించుకోకుండా కెరీర్ పైనే ఫోకస్ పెట్టడం వంటివి చేయడం వల్ల ఆలస్యంగా వివాహాలు అవుతూ.. సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల చాలామంది ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు.