Life : సమాజంలో మంచివారు, చెడ్డవారు రెండు రకాలుగా ఉంటారు. అయితే కొందరు మంచివారు కూడా తమకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల గురించి తెలుసుకున్న తర్వాత ప్రాయశ్చిత్తం కోసం తమను క్షమించాలని దేవుళ్లను కోరుకుంటూ. ఈ క్రమంలో కొందరు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. మరికొందరు తమ జీవితం బాగుండాలని ఎంతోమందికి ఎన్నో రకాలుగా దానధర్మాలు చేస్తారు. కానీ చాలామంది ప్రత్యక్షంగా సాయం చేయాల్సిన అవసరం వచ్చిన వాటిని పట్టించుకోకుండా అవసరం లేని కొందరికి సాయం చేస్తూ ఉంటారు. జీవితంలో అన్నిటికంటే పెద్ద సాయం ఏంటంటే?
జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు. అందరి జీవితాల్లోనూ ముళ్ళు ఉంటాయి. ఇవి గుచ్చుకున్నప్పుడు ఎన్నో రకాలుగా బాధలు పడాల్సి వస్తుంది. అయితే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. కానీ బాధలో ఉన్నప్పుడు జీవితం ఇంతే అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సమయంలోనే తోడు ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అయితే కుటుంబాలతో కలిసి ఉన్నవారికి బాధలో ఉన్నవారిని ఓదార్చడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. కానీ ఒంటరి జీవితం గడిపే వారికి బాధలో ఉన్నప్పుడు నరకం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా తోడు ఉంటే వారిని దేవుడు ఇలా భావిస్తారు.
Also Read : మీ భర్త పాదాలు ఇలా ఉన్నాయా.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు
అయితే మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారే నిజమైన స్నేహితులు అన్నట్లుగా.. ఒక మనిషి నిజమైన బాధలో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. జీవితం బాగుండాలని చాలామంది ఎన్నో పుణ్యకార్యాలు చేయడానికి వస్తారు.. గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉంటే ఎన్నో రకాల పుణ్యాలు చేసిన ఫలితం దక్కుతుంది అని అంటున్నారు.
ఎందుకంటే ఒక వ్యక్తి బాధలో ఉన్నాడంటే అతను సర్వస్వం కోల్పోయినట్లుగా భావిస్తాడు. ఒక్కోసారి తాను ఏం చేయలేక తీవ్రంగా కుంగిపోయి ప్రాణాలు సైతం తీసుకునేందుకు సిద్ధమవుతాడు. అలాంటి పరిస్థితి ఆ వ్యక్తికి రాకుండా మరో వ్యక్తి అడ్డుకుంటే అతడు తన చావును తప్పించినట్లే అవుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి తీవ్రమైన బాధలో ఉంటే అతడిని ఆ కూపీ నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేసే వారు పుణ్యవంతుల కంటే గొప్ప వ్యక్తి అని అంటున్నారు. బాధలో ఉండే వ్యక్తి దగ్గర దేవుడు కొలువై ఉంటాడని అలా బాధలో ఉన్న వ్యక్తిని ఆదుకుంటే దేవుడు చల్లని చూపు చూస్తాడని అంటున్నారు. అందువల్ల దానధర్మాలు, ప్రత్యేక వ్రతాలు పూజలు చేయడంతో పాటు ఇలా బాధలో ఉన్న వ్యక్తులను కూడా ఆదుకోవాలని అంటున్నారు.
ఒక వ్యక్తి తెలిసి తెలియక ఎన్నో పొరపాటు చేస్తూ ఉంటాడు. కొందరు చెబుతున్న ప్రకారం తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడని అంటారు. కానీ ఏ వ్యక్తి అయినా తన తప్పులు తెలుసుకున్నప్పుడు.. తాను బాధలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు.. ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లే అవుతుందని అంటున్నారు. అందువల్ల ఏ వ్యక్తి అయినా బాధలో కనిపిస్తే వారిని ఓదార్చే ప్రయత్నం చేసి పుణ్యఫలం దక్కించుకోవచ్చు అని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.