Homeలైఫ్ స్టైల్AC : ఏసీని ఆపేటప్పుడు చేసే ఈ ఒక్క తప్పుతో లక్షల్లో నష్టం!

AC : ఏసీని ఆపేటప్పుడు చేసే ఈ ఒక్క తప్పుతో లక్షల్లో నష్టం!

AC : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఉక్కపోతతో అల్లాడిపోతుంటాం. దీంతో వెంటనే ఎయిర్ కండీషనర్ (AC) గుర్తుకొచ్చి ఆన్ చేస్తాం. క్షణాల్లో గదిని చల్లబరిచి హాయినిచ్చే ఏసీని వాడేటప్పుడు చాలామంది కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఏసీని ఆపే విషయంలో చాలామంది సరైన పద్ధతిని పాటించరు. మీరు కూడా రిమోట్ ఉన్నా సరే నేరుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే అలవాటు ఉంటే మాత్రం జాగ్రత్త! మీ ఈ చిన్న పొరపాటు మీ ఏసీని శాశ్వతంగా పాడుచేయడమే కాకుండా, దాని రిపేర్ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ వేసవిలో మీ ఏసీని పాడుచేసుకోకుండా ఉండాలంటే.. ఏసీని డైరెక్ట్‌గా మెయిన్ స్విచ్ ద్వారా ఆఫ్ చేస్తే ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Also Read : వాటర్ బాటిల్ మూతల రంగు డిఫరెంట్ గా ఎందుకు ఉంటుంది?

ఏసీని డైరెక్ట్‌గా ఆఫ్ చేస్తే కలిగే నష్టాలు
AC కంప్రెసర్‌కు ప్రమాదం: ఏసీని రిమోట్ ఉపయోగించకుండా నేరుగా మెయిన్ స్విచ్ ద్వారా ఆఫ్ చేస్తే, దాని అంతర్భాగమైన కంప్రెసర్‌పై అనవసరమైన ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే కంప్రెసర్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కంప్రెసర్ ఏసీకి గుండె లాంటిది. అది పాడైతే ఏసీ మొత్తం పనికిరాకుండా పోతుంది. దీని రిపేర్ ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది.

కూలింగ్ సిస్టమ్‌కు దెబ్బ: ఏసీని రిమోట్ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఏసీ ముఖ్యమైన కూలింగ్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. రిమోట్ ద్వారా ఆఫ్ చేసినప్పుడు ఏసీలోని అంతర్గత భాగాలు తమంతట తాము క్రమంగా ఆగిపోతాయి. కానీ డైరెక్ట్‌గా స్విచ్ ఆఫ్ చేస్తే ఈ ప్రక్రియ సడన్‌గా ఆగిపోతుంది. ఇది కూలింగ్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది.

ఫ్యాన్, మోటర్‌కు నష్టం: మీరు విండో ఏసీ వాడుతున్నా లేదా స్ప్లిట్ ఏసీ వాడుతున్నా, ఏసీని డైరెక్ట్‌గా మెయిన్ స్విచ్ ద్వారా ఆఫ్ చేసే అలవాటు మీకు చాలా ఖర్చు తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఏసీలోని ఫ్యాన్, మోటర్ రెండూ నెమ్మదిగా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి లేదా పూర్తిగా పాడైపోతాయి. ఒకవేళ ఫ్యాన్ లేదా మోటర్ పాడైతే వాటిని రిపేర్ చేయడం లేదా కొత్తవి వేయించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.

ఎలక్ట్రికల్ పార్ట్స్‌పై ప్రభావం: ఏసీని డైరెక్ట్‌గా మెయిన్ స్విచ్ ద్వారా ఆఫ్ చేయడం వల్ల ఏసీలో ఉండే ఇతర ముఖ్యమైన ఎలక్ట్రికల్ పార్ట్స్‌కు కూడా నష్టం వాటిల్లవచ్చు. ఏసీలో అనేక సెన్సార్లు, కెపాసిటర్లు వంటి ఖరీదైన భాగాలు ఉంటాయి. సడన్‌గా పవర్ సరఫరా ఆగిపోవడం వల్ల ఈ భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ ఏసీలోని ఏదైనా ముఖ్యమైన ఎలక్ట్రికల్ పార్ట్ ఇలా పాడైతే దాని రిపేర్ లేదా మార్పు కోసం మీరు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.

అసలు ఏసీని ఎలా ఆఫ్ చేయాలంటే
వేసవిలో మీ ఏసీ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే దానిని ఆఫ్ చేయడానికి సరైన మార్గాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఏసీని ఆఫ్ చేయడానికి సరైన మార్గం ఎల్లప్పుడూ రిమోట్ ఉపయోగించడం. రిమోట్ ద్వారా ఎయిర్ కండీషనర్‌ను ఆఫ్ చేసినప్పుడు ఏసీలోని అంతర్గత భాగాలు తమంతట తాము క్రమంగా చల్లబడడానికి, ఆగిపోవడానికి సమయం లభిస్తుంది. దీనివల్ల ఏసీపై ఎలాంటి ఒత్తిడి పడదు.దానిలో సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో మీ ఏసీని పాడుచేసుకోకుండా ఉండాలంటే రిమోట్‌తోనే ఆఫ్ చేసే అలవాటు చేసుకోండి.

Also Read : మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నవారికి ఈ మూడు లక్షణాలు ఉండాలి.. అవేంటంటే?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular