spot_img
HomeNewsKyle Jamieson And Vaibhav Suryavanshi: వైభవ్ ను చూసి చుచ్చు పోసుకున్నాడు.. అదీ...

Kyle Jamieson And Vaibhav Suryavanshi: వైభవ్ ను చూసి చుచ్చు పోసుకున్నాడు.. అదీ భయమంటే..

Kyle Jamieson And Vaibhav Suryavanshi: చేసింది నాలుగు పరుగులు.. అయినప్పటికీ అతడు భయం టన్నుల్లో ఇచ్చాడు. అలాగని అతడేమి హరి వీర భయంకరమైన ఆటగాడు కాదు. సంవత్సరాలకు సంవత్సరాలు అనుభవం ఉన్న ప్లేయర్ కాదు. ఐపీఎల్ లో రెండవ ఎడిషన్ మాత్రమే ఆడుతున్నాడు. తనకు ఉన్నది 15 సంవత్సరాలు మాత్రమే. ఇంతటి వయసులో అతడు కొడుతున్న కొట్టుడు.. ఆడుతున్న ఆడుడు.. ఐపీఎల్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. పెద్ద పెద్ద తోపు ప్లేయర్లు నెలకొల్పిన ఘనతలను జ్ఞాపకాలుగా మార్చేస్తున్నాయి.

ఐపీఎల్ లో రాజస్థాన్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్య వంశీ ప్రత్యర్థి ప్లేయర్లకు సింహ స్వప్నం లాగా మారిపోయాడు. మామూలుగా అయితే సూర్య వంశీని చాలామంది బుడ్డోడు అనుకుంటారు. కానీ అతను ఆడుతున్న తీరు చూసి మాత్రం బండోడు అని భావిస్తున్నారు. బంతిని ఎలా వేసినా సరే అతడు వీర విహారం చేస్తున్నాడు. మైదానం నలుమూలల బంతిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఫీల్డర్లను ప్రేక్షకులుగా మార్చేస్తున్నాడు. బౌలర్లకు పీడకలు మిగులుచుతున్నాడు. ఇటువంటి ఆటగాడు దీర్ఘకాలం క్రికెట్లో ఉంటే.. అది అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఎంతో బలమని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి సూర్య వంశీ ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సూర్యవంశం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. జమీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు అవుట్ అయిన తర్వాత జమీసన్ సంబరాలు చేసుకున్నాడు. సూర్య వంశీ దగ్గరికి వచ్చి బిగ్గర్ గా కేకలు వేశాడు.. “15 సంవత్సరాల అబ్బాయిని చూసి నేను ఇలా భయపడతానని అసలు అనుకోలేదు. అతడిని అవుట్ చేయడానికి ముందుగానే ప్రణాళికల రూపొందించాను. అవి ఫలించాయి కాబట్టి.. ఉద్వేగానికి గురయ్యాను. అందువల్లే అలా సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చిందని” జమిసన్ వ్యాఖ్యానించాడు.. దీన్నిబట్టి సూర్యవంశీ ఆటతీరు ఎలా ఉంటుందో.. ప్రత్యర్థి బౌలర్లు అతని గురించి ఎలా ఆలోచిస్తున్నారో అవగతమవుతుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.

సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత విభిన్నంగా సెలబ్రేట్ చేసుకున్న జమిసన్ కు బిసిసిఐ షాక్ ఇచ్చింది. అతడి ఖాతాలో ఒక డి మెరిట్ పాయింట్ విధించింది.. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని 2.5 నిబంధనను అతడు ఉల్లంఘించినట్టు బీసీసీఐ పేర్కొంది. ఈ క్రమంలో సహచర ప్లేయర్లను కించపరచడం లేదా రెచ్చగొట్టడం సరైన విధానం కాదని బీసీసీఐ పేర్కొంది. కాగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు మీద ఢిల్లీ అద్భుతమైన విజయాన్ని సాధించింది.. కాగా, సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత జమిసన్ అలా కేకలు వేయడం పట్ల అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సూర్య వంశీ దెబ్బకి చుచ్చు పోసుకున్నాడని.. అందుకే ఇలా ప్రవర్తించి ఉంటాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper