Alia Bhatt: రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మస్త్ర. తాజాగా ఈ సినిమా టీమ్ హైదరాబాద్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించి.. రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిపించారు. ఈ సందర్భంగా అలియా భట్ మాట్లాడుతూ..ఈ సినిమా ఏడేళ్ల కష్టమని.. దర్శకుడు అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితో.. నాకుగేళ్లు తాము షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిపారు. కరణ్ చెప్పినట్లు ఈ సినిమా తమకు ఓ ఎమోషన్ అంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
మరోవైపు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. ఎక్కడికెళ్లినా సినిమాపై ఫ్యాన్స్ చాలా మంచిగా సపోర్ట్‌గా నిలచారని తెలిపారు. ఈ సినిమాతో రాజమౌలితో పాటు తారక్, రామ్, నేను ప్రేక్షకుల నుంచి అంతులేని ప్రేమాభిమానాలను సంపాదించుకుంటుంటో తాలా ఆశ్చర్యంగా ఉందని వివరించారు. ఈ సినిమా కూడా తనకు చాలా స్పెషల్ అని.. ప్రతి ఒక్కరి మనసులో ఓ చెక్కుచెదరని ముద్ర వేస్తుంది భరోసా కల్పించారు అలియా.
Also Read: అసలు పాన్ ఇండియా సినిమా అంటే అర్థమేంటో తెలుసా-రాజమౌళి
ఈ క్రమంలోనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. మనం ఎలా నిలబడుతున్నాం?.. మాట్లాడే తీరు, చూసే పద్దతి అన్నీ రాజమౌళి గమనిస్తుంటారని.. వివరించారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చినప్పుడు.. అయాన్ కళ్లలో చూసిన సంతోషం అంతా ఇంతా కాదని అన్నారు. అయాన్ రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని మరోసారి ఇక్కడికి వచ్చినందుకు రాజమౌళికి థ్యాంక్స్ చెప్పింది అలియా.
మరోవైపు అక్కినేని నాగార్జున గురించి స్పందించిన అలియా(Alia Bhatt) నేను ఆయన కలిసి ఈ సినిమాలో పనిచేశాం. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. సెట్స్‌లో ఎక్కువగా ఆయన కోసమే ఎదురుచూసేవారు. అంటూ నాగ్‌పై ప్రశంసలు కురిపించారు.
Also Read: ముంబయి విమానాశ్రయంలో రామ్‌చరణ్.. ఆర్ఆర్ఆర్ మెగా ఈవెంట్‌కు సర్వం సిద్ధం
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More