ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన పది మంది రాజ్యసభ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజ్యసభ ఛాంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్ పూరీ కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పది మంది సభ్యులలో కర్ణాటకకు చెందిన నారాయణ కొరగప్ప. బ్రిజ్లాల్, గీతా అలియాస్ చంద్రప్రభా, రాంజీ, హార్డ్వర్ దుబే, హర్దీప్ సింగ్ పూరి, నీరజ్ శేఖర్, బి ఎల్ వర్మ ,రామ్ గోపాల్ యాదవ్ వీరందరు యూపీ నుంచి ఎన్నికైయ్యారు. నరేష్ బన్సల్ ఉత్తరఖండ్ కి చెందినవారు.