Homeజాతీయం - అంతర్జాతీయం9న రైతు నేతలతో కేంద్రం చర్చలు

9న రైతు నేతలతో కేంద్రం చర్చలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా సవరణలకు కేంద్రం మొగ్గుచూపుతున్నది. ఈ నేపథ్యంలో చర్చల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఒక ప్రతిపాదనను పంపుతామని కేంద్ర ప్రభుత్వం తమకు తెలిపిందని చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు చెప్పారు. ఆ ప్రతిపాదనపై తమతోపాటు […]

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా సవరణలకు కేంద్రం మొగ్గుచూపుతున్నది. ఈ నేపథ్యంలో చర్చల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఒక ప్రతిపాదనను పంపుతామని కేంద్ర ప్రభుత్వం తమకు తెలిపిందని చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు చెప్పారు. ఆ ప్రతిపాదనపై తమతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాత ఈ నెల 9న ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపైనా చర్చ జరిగిందని, అయితే చట్టాలను వెనక్కి తీసుకునే అంశంపై మాట్లాడాలని తాము చెప్పినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ తికైత్‌ తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper