spot_img
HomeజాతీయంWedding Cancelled Over Makeup Issue: మేకప్‌ సామగ్రి తక్కువైందని పెళ్లి రద్దు.. రణరంగమైన వివాహ...

Wedding Cancelled Over Makeup Issue: మేకప్‌ సామగ్రి తక్కువైందని పెళ్లి రద్దు.. రణరంగమైన వివాహ వేదిక

Wedding Cancelled Over Makeup Issue: పెళ్లి జరుతుండగా.. అయ్యవారు మంత్రాలు చదువుతుండగా.. ఓ పక్కనుంచి ఆపండి అనే మాట వినిపిస్తుంది. ఇలాంటి సీన్లు సినిమాల్లో కనిపిస్తాయి. కట్నం ఇవ్వలేదనో.. తక్కువ ఇచ్చారనో.. లేక పెళ్లి కొడుకే లేదా పెళ్లి కూతురుకు అప్పటికే వేరే రిలేషన్‌ ఉందనో ఆపడం చూస్తుంటాం. ఇక కొన్ని పెళ్లిళ్లు పెళ్లి కొడుకు నచ్చలేదని ఆపిన ఘటనలూ ఉన్నాయి. కానీ మేకప్‌ సామగ్రి తక్కువైందని పెళ్లి కాన్సన్‌ చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీంతో పెళ్లి వేదిక.. రణరంగానికి వేదికైంది.

పెళ్లి మండపంలో ఊహించని ఘర్షణ
వివాహ వేడుకలు జరుగుతుండగా, మేకప్‌ ఆర్టిస్ట్‌ అందించిన సామగ్రిపై వధువు అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు కావాల్సినంత మేకప్‌ సామగ్రి లేదని, నాణ్యత తక్కువగా ఉందని ఆమె ఆరోపించింది. దీంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

పొట్టుపొట్టు కొట్టుకున్నరు..
ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి రాళ్ల రువ్వుకున్నారు. పెళ్లికొడుకు కారును వధువు వర్గీయులు ధ్వంసం చేశారు. పెళ్లికొడుకు సోదరుడిపై దాడి జరిగింది. పెళ్లి మండపంలోని కొన్ని వస్తువులు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఘర్షణలో పాల్గొన్న పలువురిని అరెస్టు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి, రాజీ కుదర్చే ప్రయత్నం చేశారు.

చివరికి పెళ్లి రద్దు
పెద్దమనుషులు, పోలీసు అధికారుల సమక్షంలో ఇరు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరికి పెళ్లిని రద్దు చేసుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. వరకట్న వేధింపులు లేదా ఇతర కారణాలు కాకుండా, కేవలం మేకప్‌ సామగ్రి తక్కువైందని పెళ్లి రద్దు కావడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.

ఈ ఘటన పెళ్లిళ్లలో పెరుగుతున్న ఆర్భాటం, వస్తు నిర్ధారణపై ఉన్న అతిశయ అంచనాలను ఎత్తిచూపుతోంది. మేకప్‌ సామగ్రి వంటి చిన్న విషయాల కోసం పెళ్లిళ్లు రద్దు కావడం, ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం సమాజంలో మారుతున్న వివాహ సంస్కృతికి నిదర్శనంగా మారింది. వివాహాలపై సమాజంలో అవగాహన మారాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper