Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: బొత్స ఏడ్చినా.. పక్కన పెట్టే ఆలోచనలో జగన్

Botsa Satyanarayana: బొత్స ఏడ్చినా.. పక్కన పెట్టే ఆలోచనలో జగన్

Botsa Satyanarayana: ఇటీవల సీనియర్ నేత బొత్స ఏడ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని( Y S Rajasekhara Reddy ) తలుచుకొని బోరున విలపించారు. ఓ ప్రెస్ మీట్ లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే కేవలం ఏడ్చేందుకు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపించారు. అయితే అంతటి సీనియర్ నేత అలాంటి భావోద్వేగం చూడలేదు. ఎందుకంటే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా బొత్స సత్యనారాయణది. అటువంటి నేత ఇలా రోధించడం ఏమిటనేది ఒక ప్రశ్న. ప్రస్తుతం […]

Botsa Satyanarayana: ఇటీవల సీనియర్ నేత బొత్స ఏడ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని( Y S Rajasekhara Reddy ) తలుచుకొని బోరున విలపించారు. ఓ ప్రెస్ మీట్ లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే కేవలం ఏడ్చేందుకు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపించారు. అయితే అంతటి సీనియర్ నేత అలాంటి భావోద్వేగం చూడలేదు. ఎందుకంటే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా బొత్స సత్యనారాయణది. అటువంటి నేత ఇలా రోధించడం ఏమిటనేది ఒక ప్రశ్న. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత హోదా అనుభవిస్తుంది బొత్స. అసలు జగన్ మోహన్ రెడ్డికి లేని ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనదే. ఆ బాధ్యతల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పిస్తారో అనే ఆందోళనలోనే బొత్స ఏడుపు డ్రామాలు మొదలు పెట్టినట్లు విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. గతం గుర్తు చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మనసులో పెట్టుకొని రాజకీయంగా తనకు దూరం పెడతారు అన్న ఆందోళనలో భాగమే ఈ ఏడుపు డ్రామాలు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* సాదాసీదా వ్యాఖ్యలతో..
వాస్తవానికి టిడిపి మంత్రి కింజరాపు అచ్చెనాయుడు మంత్రి బొత్స రోధించే మాటలు అనలేదు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా రకాల డ్రామాలు ఆడారని.. అధికారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారని.. సంతకాలు కూడా చేశారని.. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ ఈ ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దానిని పట్టుకుని బొత్స విశాఖలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం ఏడ్చేందుకే అన్నట్టు ఆ ప్రెస్ మీట్ సాగింది. అది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అన్న కామెంట్ వినిపిస్తోంది. ఎందుకంటే పాతవి తవ్వుకుంటూ పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం వస్తుంది. తనకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేస్తే శాసనమండలిలోని ప్రతిపక్ష నేత హోదా పోతుంది. పార్టీలో కూడా ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఈ ఆలోచనతోనే మంత్రి అచ్చన్న చేసిన వ్యాఖ్యలతో అప్రమత్తం అయ్యారు బొత్స.

* తిరుగు లేదని భావించి..
2009లో రెండోసారి అధికారంలోకి వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన క్యాబినెట్లో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మంత్రి కూడా. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అరుదైన అవకాశం తనకు దక్కుతుందని భావించారు. ఏకంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చని అంచనా వేశారు. కానీ అవకాశం దక్కలేదు. అయితే అనుకోని రీతిలో పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని ఆ కుటుంబం ఆరోపించింది. షర్మిల అప్పట్లో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే పిసిసి అధ్యక్షుడి హోదాలో బొత్స వాటిపై స్పందించేవారు. అప్పట్లో జాతీయస్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం ఉండేది. ఇక తిరుగు లేదని భావించిన బొత్స జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వీరవిహారం చేసేవారు. రాజశేఖర్ రెడ్డి మరణం గుర్తుచేస్తూ దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. అప్పట్లో పౌర విమానయాన అధికారితో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్న విషయాన్ని కూడా బొత్స బయటపెట్టారు. అంతటితో ఆగకుండా రాజశేఖర్ రెడ్డి పై కూడా ఆరోపణలు చేశారు. 365 రోజులు బ్రాందీ ముట్టకుండా రాజశేఖర్ రెడ్డి ఉండేవారు కాదని కామెంట్స్ చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఈ విమర్శలు తాకాయి.

* పరస్పర అవసరాలతో..
పిసిసి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్ కుటుంబంపై చేసిన ఆరోపణలతోనే బొత్స కు వైసీపీలోకి ఎంట్రీ లభించలేదు. కానీ 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న బొత్సను జగన్మోహన్ రెడ్డి చేరదీయాల్సి వచ్చింది. అయితే బొత్స వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన మాటలనే బొత్స చెప్పడం ప్రారంభించారు. అమరావతిని స్మశానంతో పోల్చినా.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడినా.. అది జగన్ మోహన్ రెడ్డికి ఇష్టమైన రీతిలోనే కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి అన్ని మరిచిపోయి బొత్సకు ఎనలేని ప్రాధాన్ ఇప్పుడు కూడా అదే ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. ఇటువంటి సమయంలో పాతవన్నీ గుర్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి తనను ఎక్కడ పక్కన పెడతారో నన్న ఆందోళనలోనే బొత్స ప్రెస్ మీట్ లో ఏడ్చారు అన్నది వాస్తవం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper