Car Loan Interest Rates : నేటి కాలంలో చాలా మంది కొత్త వస్తువు కొనుగోలు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలంటే బ్యాంకు రుణం కచ్చితంగా తీసుకుంటున్నారు. నెలనెలా ఈఎంఐ చెల్లించడం ద్వారా ఎలాంటి ఫైనాన్సియల్ వెయిట్ పడొద్దని భావించి ఇలా చేస్తున్నారు. అయితే ఈ లోన్ తీసుకునేటప్పుడు చాలా విషయాలు గ్రహించాలి. ముఖ్యంగా బ్యాంకులు లేదా సంస్థలు విధించే వడ్డీ రేట్లలో కొన్ని మెలికలు ఉంటాయి. వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. వీటిలో భాగంగా వడ్డీ ‘ప్లాట్ రేట్’.. ‘రెడ్యూసింగ్ రేట్’.. బ్యాంకు లోన్ ఇచ్చే టప్పుడు ఈ రెండింటిలో దేని ద్వారా రుణం ఇస్తున్నారో తెలుసుకోండి. ఎందుకంటే రెండింటిలో చాలా తేడాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉదాహరణకు ఏదైనా కొత్త కారును బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసే ముందు ఎలాంటి వడ్డీ రేటును విధిస్తున్నారో తెలుసుకోవాలి. రూ.10 లక్షలు పెట్టి కారు కొంటున్నారనుకుందాం. దీనిపై 10 శాతం వరకు ‘ప్లాట్ రేట్’ వడ్డీ అని చెప్పాడనుకుందాం. టెన్యూర్ 5 సంవత్సరాలు అనుకుందాం.. ప్లాట్ రేట్ ప్రకారం.. రూ.10 లక్షలపై 5 సంవత్సరాల వడ్డీని ఒకే విధంగా వసూలు చేస్తుంటారు. అంటే నెలనెలా ఈఎంఐ చెల్లించినా.. లేదా మధ్యలో అదనంగా డబ్బులు కట్టినా కూడా వడ్డీ రేటు మారదు. దీనినే ప్లాట్ రేట్ వడ్డీ రేటు అంటారు.
రూ.10 లక్షల లోన్ పై 10 శాతం వడ్డీ 5 సంవత్సరాల టెన్యూర్ పై రూ.5 లక్షల వడ్డీ అవుతుంది. అంటే మొత్తం 15 లక్షలు చెల్లిస్తున్నారన్న మాట.
ఇక రెడ్యూసింగ్ రేట్ విషయానికొస్తే.. దీని ప్రకారం..ఇదే రూ.10 లక్షల లోన్ తీసుకొని 5 సంవత్సరాల టెన్యూర్ ఏర్పాటు చేసుకున్నారని అనుకుందాం.. అప్పుడు వడ్డీ రేటు క్రమంగా తగ్గుతుంది. అంటే ఈఎంఐ చెల్లించిన తరువాత మిగతా మిగిలిన ప్రిన్సిపుల్ మొత్తానికి మాత్రమే వడ్డీని విధిస్తారు.
రూ. 10 లక్షలపై 10 శాతం వడ్డీ తీసుకుంటే నెలకు రూ.21,247 చెల్లించాల్సి వస్తుంది. రెడ్యూసింగ్ ప్రకారం.. 5 సంవత్సరాలకు మొత్తం వడ్డీ రూ.2.75 లక్షలు మాత్రమే చెల్లిస్తారు. మొత్తం రూ.12.75 లక్షలతో లోన్ పూర్తవుతుంది.
ఈ విధంగా ప్లాట్ రేట్.. రెడ్యూసింగ్ రేట్ కు చాలా తేడాలు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని లోన్ తీసకునేటప్పుడు ఏ ప్రకారంగా వడ్డీ రేట్ విధిస్తున్నారో తెలుసుకోవాలి. అయితే ఇక్కడో విషయం గమనించాలి. రెడ్యూసింగ్ రేట్ పై లోన్ తీసుకుంటే.. ఆర్బీఐ ప్రకారం వడ్డీ రేట్లు మారితే .. ఇక్కడ వడ్డీ పెరుగొచ్చు.. లేదా తగ్గొచ్చు.. కానీ ప్లాట్ రేట్ ప్రకారం తీసుకుంటే.. వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా ఒకే విధంగా ఉంటుంది.