spot_img
HomeజాతీయంMichaung Cyclone: పడవల్లా కార్లు, ఇళ్లు.. తమిళనాడులో ఐదు దశాబ్దాలుగా చూడని జల ప్రళయం..

Michaung Cyclone: పడవల్లా కార్లు, ఇళ్లు.. తమిళనాడులో ఐదు దశాబ్దాలుగా చూడని జల ప్రళయం..

Michaung Cyclone: తమిళనాడు జలప్రళయంలో చిక్కుకుంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుఫానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడు అంత విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నైలో ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. దీంతో ఎటు చూసినా జలమే కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం చెన్నై తో పాటు శివారు జిల్లాల్లో వర్షపాతం నమోదయింది. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు,పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదలకు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 160 విమాన సేవలు రద్దు అయ్యాయి. మరో 33 సర్వీసులను బెంగళూరుకు దారి మళ్ళించారు. కాంచీపురం, తిరువల్లూరు, చంగల్పట్ట జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంది. చెన్నైలోని దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి ప్రముఖులు ఉండే పోయిస్ గార్డెన్ హైవే ఏడు అడుగులు మేర కుంగిపోయింది.

గత ఐదు దశాబ్దాలుగా ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని తమిళనాడు వాసులు చెబుతున్నారు. 2017లో చెన్నైలో కుంభవృష్టి కురిసింది. అప్పట్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. కానీ అంతకుమించి మిచాంగ్ బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 500 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Oktelugu Epaper