Akhanda collection: అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు వారాలు అయిపోతున్నా ఇప్పటికీ కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గడం లేదు. నిజానికి 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా. అలాగే కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు.
దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ పడలేదు. బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. ఈ చిత్రం 28 రోజుల కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే..
నైజాం 19.70 కోట్లు
సీడెడ్ 14.91 కోట్లు
ఉత్తరాంధ్ర 6.06 కోట్లు
ఈస్ట్ 4.09 కోట్లు
వెస్ట్ 3.83 కోట్లు
గుంటూరు 4.66 కోట్లు
కృష్ణా 3.55 కోట్లు
నెల్లూరు 2.58 కోట్లు
Also Read: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 59.38 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 10.16 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 69.54 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తమ్మీద ఈ చిత్రం 4 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.69.54 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.17 కోట్ల లాభాలు దక్కాయి. పైగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు లాభాలు వచ్చాయి. పైగా ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతుంది.
Also Read: హిందీలోకి ‘అఖండ’.. అలాగే ‘అఖండ 2’ కూడా ఆగమనం !
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Akhanda collection has not stopped
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com