అందరు ఊహించిందే జరిగింది. తాలిబన్ల ఆగడాల పర్వం పెరిగిపోతోంది. తాలిబన్లు పైకి నీతులు చెబుతున్నా బయట మాత్రం వారిలోని కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతీకార దాడులకు తెగబడుతూ మానవత్వాన్ని మరచిపోతున్నారు. నిత్యం దాడులు చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు. చట్టాలను కాపాడాల్సిన వారే కాలయములుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తాలిబన్ల దాడికి తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. అయినా ఏం చేయలేని దుస్థితి. ఏం మాట్లాడలేని పరిస్థితి.
మహిళల హక్కులను కాపాడతామని చెప్పినా తాలిబన్ల తీరులో మార్పు కనిపించడం లేదు. మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. ఆకృత్యాలకు కొదవే లేదు. వారి ప్రవర్తనకు దేశం యావత్తు భయభ్రాంతులకు గురవుతోంది. మహిళలు ఉద్యోగులు చేయకుండా షరతులు విధిస్తున్నారు. బయటకు వస్తే ఊరుకోవడం లేదు. దీంతో కార్యాలయాలకు సైతం వెళ్లకుండా చూస్తున్నారు. మహిళలు బయటకు రాకుండా షరతులు విధించారు పాఠశాలల్లో కూడా మహిళలకు పురుషులు పాఠాలు చెప్పకూడదని నిబంధన పెట్టారు.
మహిళలు బురఖా ధరిస్తేనే బయటకు రావాలని సూచించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉన్న వారిని కిరాతకంగా వెంటాడి హతమారుస్తున్న సంఘటనలు చూస్తున్నాం. మహిళలపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాలిబన్ల విచ్చలవిడితనంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దేశంలో నానాటికి పరిస్థితులు దిగజారుతున్నాయి.
అఫ్గాన్ లో తాలిబన్లు తాజాగా ఓ స్వలింగ సంపర్కుడిని సైతం వదిలిపెట్టలేదు. తాలిబన్ల దృష్టిలో స్వలింగ సంపర్కం వ్యతిరేకం కావడంతో వారిని వెంటాడి మరీ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లేందుకు ఓ స్వలింగ సంపర్కుడు ప్రయత్నించగా అది వారి దృష్టికి రావడంతో వారు అతడిపై లైంగికదాడికి తెగబడినట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గాన్ లో చట్టాలు గాలికొదిలేసి తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పిశాచాల్లా మారి ప్రజలను వేధిస్తున్నారు.