Homeఎంటర్టైన్మెంట్Shilpa Shetty : శిల్పా శెట్టి షాకింగ్ నిర్ణయం.. మరి అతని పరిస్థితేంటి ?

Shilpa Shetty : శిల్పా శెట్టి షాకింగ్ నిర్ణయం.. మరి అతని పరిస్థితేంటి ?

Shilpa Shetty : ‘శిల్పాశెట్టి’ ( Shilpa Shetty) భర్త ‘రాజ్ కుంద్రా’ ( Raj Kundra ) అశ్లీల చిత్రాల సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకముందు వరకు ‘శిల్పాశెట్టి’ అంటే ఒక గౌరవం, ‘శిల్పాశెట్టి’ అంటే ఒక క్రేజ్, ‘శిల్పాశెట్టి’ అంటే ఒక స్టార్. కానీ ఇప్పుడు ‘శిల్పాశెట్టి’ అంటే.. విమర్శలతో కుమిలిపోతూ నలిగిపోతున్న ఒక మాజీ హీరోయిన్. నిజంగానే ఆమె భర్త ‘రాజ్ కుంద్రా’ ‘శిల్పాశెట్టి’ జీవితాన్ని ఒక్కసారిగా అపవాదుల మయం చేశాడు. దానికి […]

Shilpa Shetty Raj KundraShilpa Shetty : ‘శిల్పాశెట్టి’ ( Shilpa Shetty) భర్త ‘రాజ్ కుంద్రా’ ( Raj Kundra ) అశ్లీల చిత్రాల సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకముందు వరకు ‘శిల్పాశెట్టి’ అంటే ఒక గౌరవం, ‘శిల్పాశెట్టి’ అంటే ఒక క్రేజ్, ‘శిల్పాశెట్టి’ అంటే ఒక స్టార్. కానీ ఇప్పుడు ‘శిల్పాశెట్టి’ అంటే.. విమర్శలతో కుమిలిపోతూ నలిగిపోతున్న ఒక మాజీ హీరోయిన్. నిజంగానే ఆమె భర్త ‘రాజ్ కుంద్రా’ ‘శిల్పాశెట్టి’ జీవితాన్ని ఒక్కసారిగా అపవాదుల మయం చేశాడు.

దానికి తగ్గట్టుగానే తన భర్త అరెస్ట్ వ్యవహారం శిల్పాశెట్టిని బాగా ఇబ్బంది పెట్టింది. బాలీవుడ్ లో ఆమెకు ఉన్న గౌరవం, విలువ పోయాయి. చివరకు షోల నుండి కూడా జడ్జ్ గా ఆమెను తపించారు. అసలు ఒకప్పుడు ఆమెను జడ్జ్ గా చేయమని ఒప్పించడానికి బుల్లితెర నిర్మాతలు నానా కష్టాలు పడుతూ ఆమె చుట్టూ తిరిగే వారు.

కానీ, ఇప్పుడు శిల్పాశెట్టి ని దూరం పెట్టడానికి నిర్మాతలు మొహమాటం పడట్లేదు. శిల్పాశెట్టి కూడా బయటకు అడుగు పెట్టడం మానేసింది. మీడియాకి పూర్తిగా మొహం చాటేసింది. అయితే, తాజాగా శిల్పాశెట్టి తన జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తన భర్త జైలు నుంచి బయటకు వచ్చినా, ఇక అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది.

శిల్పా శెట్టి తీసుకున్న నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, శిల్పాశెట్టి ఇక ఒంటరి జీవితాన్ని లీడ్ చేయబోతుంది. అవసరం అయితే భర్తకు విడాకులు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఆమె ఉంది అట. తన భర్త కారణంగా తనకి వ్యక్తిగతంగా భారీ నష్టం జరిగింది అని ఆమె ఫీల్ అవుతుంది.

అందుకే ప్రస్తుతం భర్తను దూరం పెట్టి.. జరిగిన ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు శిల్పాశెట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది. శిల్పా శెట్టి కి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకుంది అట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper