అత్యంత ప్రజాదరణవెలుగులోకి మరో మోసం.. వాట్సాప్ వాడే వాళ్లకు అలర్ట్..?

వెలుగులోకి మరో మోసం.. వాట్సాప్ వాడే వాళ్లకు అలర్ట్..?


ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఎక్కువగా వినియోగించే వాట్సాప్ యాప్ ను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి స్నేహితుని పేరుతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో తన ఫోన్ నంబర్ పని చేయడం లేదని మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ చెబితే వాట్సాప్ ఖాతాను వేరే మొబైల్ లో ఉపయోగించవచ్చని ఉంటుంది.

ఆ ఓటీపీని పొరపాటున చెప్పారంటే మాత్రం మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవడం గ్యారంటీ. పాత ఫోన్ నుంచి వాట్సాప్ ను కొత్త ఫోన్ లోకి మార్చుకోవాలని అలా చేయాలంటే ఓటీపీ ఇవ్వాలని తెలిసిన వాళ్ల పేర్లతో వాట్సాప్ కు సందేశాలు పంపిస్తూ కొందరు మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తెలిసిన వ్యక్తుల పేర్లతో వాట్సాప్ కు మెసేజ్ వస్తే ఓటీపీలు చెప్పవద్దని అలా చేస్తే మోసపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ వాళ్లు మీ వాట్సాప్ ఓటీపీని తీసుకుంటే మీ మొబైల్ లోని వాట్సాప్ లాగ్ ఔట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తరువాత మోసగాళ్లు మన వాట్సాప్ ఖాతాలోని కాంటాక్ట్ ల సహాయంతో ఇతరులను కూడా అదే విధంగా మోసం చేస్తారు. వాట్సాప్ యాప్ వినియోగించేవాళ్లు మన ఫోన్ నంబర్ కు మనం మన నంబర్ ను ఎంటర్ చేస్తే మాత్రమే ఓటీపీ వస్తుందనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.,

తెలిసిన వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తే అది నిజమో కాదో మొదట నిర్ధారించుకోవాలి. వాట్సాప్ యాప్ కు ఎల్లవేళలా టూ స్టెప్ వెరిఫికేషన్ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కసారి మోసపోయామంటే భవిష్యత్తులో ఖచ్చితంగా బాధ పడాల్సి వస్తుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Ravan Arrest : రావణ్ ఫోన్లో వీడియోలు మాత్రమే కాదు.. చాలామంది అమ్మాయిలు కూడా..

Ravan Arrest ఉపా చట్టం కింద అరెస్టయి నెల్లూరు జిల్లా జైలులో ఉన్న.. బచ్చలికూరి జోసఫ్ అలియాస్ రావణ్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్నటిదాకా ఆయన ఫోన్ లో కేవలం...

Cyber Crime Funds: అక్షరాల 34,855 కోట్లు.. ఈ డబ్బు వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా?

Cyber Crime Funds: చేతికి మట్టి అంటకూడదు. ఒంటికి చెమట పట్టకూడదు. ఒళ్ళు అసలు వంచకూడదు. కానీ కోట్లకు కోట్లు ఖాతాలో జమ కావాలి. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి. ఆగర్బ శ్రీమంతులుగా రాత్రికి...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Thammineni Sitaram: తమ్మినేని సీతారాంను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది..

Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు...

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.....

AP Investment Ranking: దేశంలోనే ఏపీ 8వ స్థానం.. తెలంగాణకు ఎంతకు దిగజారిందంటే?

AP Investment Ranking: నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ (ఐఎఫ్‌ఐ) రాష్ట్రాల పెట్టుబడి వాతావరణాన్ని మరింత విస్తృతంగా అంచనా వేసే కొత్త సాధనం. గతంలో కేంద్రం నిర్వహించిన...
Exit mobile version