Ravan Arrest ఉపా చట్టం కింద అరెస్టయి నెల్లూరు జిల్లా జైలులో ఉన్న.. బచ్చలికూరి జోసఫ్ అలియాస్ రావణ్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్నటిదాకా ఆయన ఫోన్ లో కేవలం బూతు బొమ్మల వ్యవహారం మాత్రమే తెలిసింది. ఇప్పుడు పోలీసులు విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి.
రావణ్ కేవలం హిందూధర్మం మీద.. రాజకీయ నాయకుల మీద విమర్శల వరకే పరిమితం కాలేదు. నక్సలైట్లకు మద్దతు.. ఉగ్రవాదులకు సపోర్టు వరకే ఆగిపోలేదు.. పిఠాపురంలో పోలీస్ స్టేషన్లో అరెస్టు అయిన తర్వాత.. అతని ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడు డిలీట్ చేసిన డేటా మొత్తం రికవరీ చేసే పనిలో పడ్డారు.. రికవరీ చేసిన వాటిల్లో దారుణమైన వీడియోలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక నాలుగు నిమిషాల 32 సెకండ్ల వీడియోలో అత్యంత దారుణమైన దృశ్యాలు ఉన్నాయి. శరీరం మీద దుస్తులు లేని ఓ అమ్మాయి ఏడుస్తోంది.. ఇడియట్ .. ఫ్లాష్ వేయాలి.. అప్పుడు మాత్రమే వీడియోలో క్వాలిటీ ఉంటుందని అతడు గట్టిగా గద్దించాడు. ఆ వాయిస్ రావణ్ అసలు రూపాన్ని బయటపెడుతోంది.
రావణ్ తొలగించిన ఆ వీడియోలు అతడి క్రూరమైన మనస్తత్వాన్ని వెల్లడిస్తున్నాయి. అతడు హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసుల్లో ఆరుగురు మహిళలను వేధించాడు. ఫేక్ సర్టిఫికెట్లతో దందా సాగించాడు. అప్పుడే అతడి అసలు ఒక చిత్రం బయటపడింది. సోషల్ మీడియాని వాడుకుంటూ.. రవి అనే స్నేహితుడితో కలిసి అతడు ఒంటరి మహిళలను లొంగదీసుకోవడానికి ప్రణాళికల రూపొందించాడు. ముఖ్యంగా వివాహం చేసుకున్న మహిళలను.. బోటిక్ వంటి వాటి నిర్వహించే వారిని టార్గెట్ చేసుకున్నాడు. పరిచయం పెంచుకొని.. దగ్గరయ్యేవాడు. అనంతరం ఆ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూ లక్షలు వసూలు చేశాడు. ఇతడు వేధింపులు తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరికి అమెరికా పారిపోయింది. ఇలా అడ్డగోలుగా వసూలు చేసిన డబ్బులతో రావణ్ తన భార్య పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు.
రావణ్ తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. 2024 వరకు ఆమెను తీవ్రంగా హింసించాడు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాదు రావణ్ నిర్వహించిన ఐసిఐసిఐ.. యస్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతని ఫోన్ డాటా.. వాట్సప్ చాట్ మొత్తాన్ని లోతుగా తవ్వుతున్నారు. ఆ సంవత్సరంలో బాలికలు.. యువతులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే.. ఉపా మాత్రమే కాదు.. అత్యంత కఠినమైన ఫోక్సో చట్టం కింద కూడా ఇతడికి కఠిన శిక్ష పడుతుంది.
బయట సమాజానికి ఇతడు సిద్ధాంతాలు చూపిస్తున్నాడు. ముసుగులు తొడుగుతున్నాడు. దాని వెనుక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. వారితో దారుణాలకు పాల్పడి డబ్బులు వసూలు చేశారు. ఇటువంటి వ్యక్తిని గొప్పవాడని చెబుతున్నవారు.. సిద్ధాంతకర్త అని పేర్కొంటున్నవారు.. ఒకసారి ఆలోచించుకోవాలి..
