https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ రైట్స్ ఎవరికి.?

రాజమౌళి బాహుబలి సినిమాతో తన స్ధాయి సత్తా ఎంటో బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా చూపించాడు. బాహుబలి చిత్రం ఉత్తరాదిన బాలివుడ్ స్టార్ హీరోల సినిమాల స్థాయిలో రాబట్టింది. బాహుబలిని బాలీవుడ్ లో కరణ్ జోహర్ విడుదల చేసి భారీగా లాభాలను దక్కించుకున్న మాట అందరికి తెల్సిందే. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ఆర్ ఇప్పటికే ఈ చిత్రాన్ని దాదాపు 10 బాషల్లో విడుదల చేస్తామంటూ దానయ్య ప్రకటించిన విషయం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 10:26 PM IST
    Follow us on

    రాజమౌళి బాహుబలి సినిమాతో తన స్ధాయి సత్తా ఎంటో బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా చూపించాడు. బాహుబలి చిత్రం ఉత్తరాదిన బాలివుడ్ స్టార్ హీరోల సినిమాల స్థాయిలో రాబట్టింది. బాహుబలిని బాలీవుడ్ లో కరణ్ జోహర్ విడుదల చేసి భారీగా లాభాలను దక్కించుకున్న మాట అందరికి తెల్సిందే. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ఆర్ ఇప్పటికే ఈ చిత్రాన్ని దాదాపు 10 బాషల్లో విడుదల చేస్తామంటూ దానయ్య ప్రకటించిన విషయం తెల్సిందే .

    Also Read: నాగచైతన్య బర్త్ డే ట్రీట్.. ఏంటో తెలుసా?

    రాజమౌళి సినిమా ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కు మాత్రమే కాకుండా అన్ని భాషల వారకి నచ్చుతుందనే ఉద్దేశ్యంతో అన్ని భాషలనుండి రైట్స్ దక్కించుకునేందుకు చాలామందే వస్తున్నారు. పలు భాషల్లో ఈ చిత్రం విడుదల చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అంటూ ప్రెస్ మీట్ లో స్వయంగా దానయ్య వెళ్లడించిన విషయం తెల్సిందే .

    ఇతర భాషల విషయం పక్కన పెడితే హిందీలో ఈ చిత్రంను విడుదల చేసేవారు ఎవరా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . బాలివుడ్ ప్రముఖ సంస్థ లైన ధర్మ ప్రోడక్షన్స్ మరియు రిలయన్స్ ఎంటర్ ట్రైన్ మెంట్ ఇంకా పలు చిన్నా పెద్ద సంస్ధలు ఆర్ఆర్ ఆర్ డబ్బింగ్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయట. నిర్మాత సైతం షాక్ అయ్యే ప్రైస్ ను వారు ఆఫర్ చేస్తున్నారట.

    Also Read: బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా?

    అయితే ప్రస్తుతానికి ఏ భాష రైట్స్ ను అమ్మే యోచనలో దానయ్య లేడని సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయిన తర్వాత అమ్మాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బింగ్ రైట్స్ అమ్మే విషయంలో రాజమౌళి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత ఆరు నెలలు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగబోతుంది. ఆ అరునెలలు ఈ బిజినెస్ వ్యవహారాలు చక్కబెట్టేలా ప్టాన్ చేస్తున్నారు.

    ఈ చిత్రాన్ని350 నుండి 400 కోట్లు బడ్జేట్ తో నిర్మిస్తున్నట్లు దానయ్య ప్రకటించిన విషయంతెలిసిందే . దాంతో ప్రీ రిలిజ్ బిజినెస్ 500 నుండి 600 కోట్లు ఉండేలా ప్లాన్ చేయవచ్చు అంటూ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్