Cyber Crime Complaint: మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్ విషయంలో మొబైల్ లేకుండా జరగడం లేదు. 100 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు మొబైల్ లోని యూపీఐ ద్వారా మనీ సెండ్ చేస్తున్నారు. అయితే బ్యాంకు వ్యవహారం మొత్తం మొబైల్ లోనే ఉండడంతో కొందరు సైబర్ నేరగాళ్ళు మొబైల్ లో ఉన్న డేటాను చోరీ చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా బ్యాంకు వివరాలు తెలుసుకొని డబ్బులు మాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎన్నో రకాలుగా డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు వెలుగు చూశాం. అయితే డబ్బులు పోయినా వెంటనే ఇలా చేస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏం చేయాలంటే?
కొంతమంది డబ్బులు పోయిన విషయం మెసేజ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత తమ దగ్గరి స్నేహితులకు.. తెలిసినవారికి ఆ విషయం చెబుతారు. అలా రాత్రి వరకు లేదా మరుసటి రోజు వరకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. ఒకవేళ అలా సమయం ఎక్కువగా గడిచిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికే డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కోల్పోతారు. అయితే డబ్బులు పోగొట్టుకున్నా.. కూడా తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పోలీసులు తెలుపుతున్నారు.
ఎవరైనా డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి పోగొట్టుకున్నట్లు మెసేజ్ వస్తే.. వెంటనే 1930 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఫోన్ కూడా డబ్బులు పోగొట్టుకున్న గంట లోపు మాత్రమే చేయాలని అంటున్నారు. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ గంటలోపు డబ్బులు పోయిన విషయం పోలీసులకు తెలిపితే తిరిగి తీసుకువచ్చే అవకాశాలు 70% వరకు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు రికవరీ చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ సమయం దాటిపోతే మాత్రం ఏ విధమైన ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికే సైబర్ నేరగాళ్లు ఈ డబ్బును వివిధ మార్గాల్లో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉండదని అంటున్నారు. అందుకే బాధితులు వెంటనే అప్రమత్తమై గంటలోపు మాత్రమే పోలీసులకు 1930 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అంటున్నారు. అయితే అంతకుముందే డబ్బుల ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. కొత్త నెంబర్ పై అప్రమత్తంగా ఉండి లిఫ్ట్ చేయకుండా ఉండడమే మంచిదని.. ముఖ్యంగా భారత దేశం కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.