Homeలైఫ్ స్టైల్Whale Longevity Secret: మనమూ 200 ఏళ్లు బతికేయొచ్చు.. తిమింగలం దీర్ఘాయువు రహస్యం ఇదే!

Whale Longevity Secret: మనమూ 200 ఏళ్లు బతికేయొచ్చు.. తిమింగలం దీర్ఘాయువు రహస్యం ఇదే!

Whale Longevity Secret: మనిషి సగటు ఆయుష్షు వందేళ్లు అని మనకు తెలుసు. కానీ వివిధ కారణాలతో ప్రస్తుతం 70 ఏళ్లకు తగ్గిపోయింది. కానీ, ఇప్పుడు మనం 200 ఏళ్లు బతికే ఫార్ములాను వైద్యులు గుర్తించారు. బౌహెడ్‌ తిమింగలం డీఎన్‌ఏ రిపేర్‌ ప్రోటీన్‌ మానవ దీర్ఘాయువును 200 సంవత్సరాల వరకు పెంచే అవకాశాన్ని చూపిస్తోంది. రోచెస్టర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ CIRBP ప్రోటీన్‌ను మానవ కణాల్లో ప్రయోగించి విజయం సాధించారు. తిమింగలం దీర్ఘాయువు రహస్యం అంటార్కిటిక్‌కు చెందిన తిమింగలం […]

Whale Longevity Secret: మనిషి సగటు ఆయుష్షు వందేళ్లు అని మనకు తెలుసు. కానీ వివిధ కారణాలతో ప్రస్తుతం 70 ఏళ్లకు తగ్గిపోయింది. కానీ, ఇప్పుడు మనం 200 ఏళ్లు బతికే ఫార్ములాను వైద్యులు గుర్తించారు. బౌహెడ్‌ తిమింగలం డీఎన్‌ఏ రిపేర్‌ ప్రోటీన్‌ మానవ దీర్ఘాయువును 200 సంవత్సరాల వరకు పెంచే అవకాశాన్ని చూపిస్తోంది. రోచెస్టర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ CIRBP ప్రోటీన్‌ను మానవ కణాల్లో ప్రయోగించి విజయం సాధించారు.

తిమింగలం దీర్ఘాయువు రహస్యం
అంటార్కిటిక్‌కు చెందిన తిమింగలం 211 సంవత్సరాల వరకు జీవిస్తూ, ట్రిలియన్ల కణాల్లో క్యాన్సర్‌ దాదాపు లేకుండా ఉంటుంది. CIRBP ప్రోటీన్‌ డీఎన్‌ఏ డబుల్‌ స్ట్రాండ్‌ బ్రేక్‌లను మరింత కచ్చితంగా రిపేర్‌ చేస్తుంది. చల్లని నీటి పరిస్థితుల్లో దాని శక్తి పెరుగుతుంది. మానవుల కంటే 100 రెట్లు ఎక్కువ ఉండటం వల్ల వారు వయస్సు, వ్యాధులకు గెలిచింది.

ప్రయోగాత్మక ఫలితాలు
ఈగల్లో CIRBP ఇంజెక్ట్‌ చేస్తే వాటి ఆయుష్షు పెరిగింది, మానవ కణాల్లో డీఎన్‌ఏ మెరుగుపడింది. పెటో పారడాక్స్‌ ప్రకారం, పెద్ద శరీరాలు క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువ కావాలి, కానీ ఈ ప్రోటీన్‌ కణాలను ‘స్వయం ధ్వంసం‘కు గురి చేయకుండా రక్షిస్తుంది. ఇది క్యాన్సర్‌ నివారణకు కీలకం.

మానవులకు అనువర్తన సాధ్యతలు
ప్రస్తుతం మానవుల్లో పూర్తి పరీక్షలు జరగలేదు, కానీ ఈ ప్రోటీన్‌ థెరపీలు వయస్సు సంబంధ వ్యాధులను, క్యాన్సర్‌ను అరికట్టగలవు. సర్జరీలు, ఓర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లలో కణాలను రక్షించవచ్చు. మానవ సగటు 73.8 సంవత్సరాల నుంచి మూడు రెట్లు పెరగవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ప్రోటీన్‌ ఎలా పనిచేస్తుందో పూర్తిగా తెలుసుకోవాలి, మానవ ట్రయల్స్‌కు సమయం పడుతుంది. ఇది ఆంటీ–ఏజింగ్, క్యాన్సర్‌ చికిత్సలకు విప్లవాత్మక మార్పు తీసుకురావచ్చు. జీన్‌ ఎడిటింగ్‌ టెక్నాలజీలతో కలిపితే భవిష్యత్‌లో దీర్ఘజీవి మానవులు సాధ్యమే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper