Love Marriage: హిందూ సంప్రదాయంలో జన్మనక్షత్రం ఆధారంగా పేర్లు పెడతారు. మన నక్షత్రం ప్రకారం మనకు వచ్చే రాశితో పేరు ప్రారంభం అవుతుంది. దీంతో ద్వాదశ రాశుల్లో ఏదో ఒక రాశితో అందరికి అనుబంధం ఉంటుంది. దాని ప్రకారమే వారి జాతకాలు చూస్తుంటారు. పంచాంగం కూడా అలాగే చెబుతారు. అయితే ఇక్కడ ఓ నాలుగు పేర్లు ఉన్న అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తుల గుణగణాల గురించి చర్చ సాగుతోంది. వారు ప్రేమవివాహం చేసుకుంటారని చెబుతున్నారు. అయితే వారి గురించి ఓ చర్చ చేద్దాం.

పేరులో మొదటి అక్షరం అ తో మొదలయ్యే వారి గురించి తెలుసుకుంటే వారు జీవితంలో ప్రేమ వివాహం చేసుకుంటారట. ఒక్కసారే ప్రేమలో పడతారట. తమ జీవితభాగస్వామిని అపురూపంగా చూసుకుంటారని తెలుస్తోంది. దీంతో తమ భార్యను ప్రేమగా చూసుకునే తత్వం కూడా వీరిదేనని చెబుతుంటారు.
Also Read: Acharya: ఆచార్య లో ఆ సన్నివేశం కి ఏడుపు ఆపుకోలేమా..?
ఇక మరో అక్షరం పి తో మొదలయ్యే పేరు గల వారు కూడా ప్రేమకు నమ్మకంగా ఉంటారు. జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటారు. వీరు కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటారు. తాము అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. దీంతో సంతోషంగా ఉంటారు
వీ తో మొదలయ్యే వారు కూడా జీవితంలో ప్రేమ వివాహాలే చేసుకుంటారు. వీరి స్వభావం కూడా రొమాంటిక్ గా ఉండటంతో అందరిని ఆకట్టుకుంటారు. జీవితభాగస్వామిగా ప్రేమించిన వారినే ఎక్కువగా చేసుకుంటారు. దీంతో ప్రేమ పెళ్లి చేసుకుని వీరు కూడా జీవితంలో మధురానుభూతులను అనుభవిస్తారు. అందుకే భార్య కోరికలను అన్నింటిని నెరవేరుస్తారు.

ఇక ఎస్ తో మొదలయ్యే వారు ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని ఆస్వాదిస్తారు. నమ్మిన వారి కోసం ప్రాణాలిస్తారు. నమ్మకం పోతే మాత్రం క్షమించరు. వీరు కూడా జీవితంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటారు. హృదయం స్వచ్ఛమైనది విశాలమైనది కావడంతో ప్రేమించిన వారి కోసం అహర్నిశలు తపిస్తారు. వారి కోసమే సర్వస్వాన్ని ధారపోస్తారు. జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు. నందనవనంలాంటి జీవితం కోసం శ్రమిస్తుంటారు.
హిందూ ఆచార ప్రకారం మన పంచాంగంలో ఎన్నో వింతలు చూస్తుంటాం. మన మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లలో ఎన్నో విశేషాలు ఉంటాయి. ఏ, పీ, వీ, ఎస్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లలో ఉన్న జాతకం ప్రకారం వారు ప్రేమ వివాహాలు చేసుకుంటారని చెబుతున్నారు.
Also Read:Gandhi Hospital: ఆరోగ్యశాఖ మంత్రి ఈటలనే.. గాంధీ ఆస్పత్రి చెబుతోంది రాసుకోండి..