spot_img
Homeలైఫ్ స్టైల్Enjoy your freedom: మీరు ఏం చేసినా దొరకని స్వాతంత్య్రం ఇదీ.. ఎంజాయ్ చేయండి

Enjoy your freedom: మీరు ఏం చేసినా దొరకని స్వాతంత్య్రం ఇదీ.. ఎంజాయ్ చేయండి

Enjoy your freedom: మానవ జీవితంలో కూడు, గుడ్డ, ఆవాసం.. ముఖ్యమైన ప్రాధాన్యాలు. కానీ వీటికి మించిన గొప్ప ప్రాధాన్యం ఉందంటున్నారు మానసిక నిపుణులు. ప్రతీ మనిషి మనసుకు కూడా స్వేచ్ఛ కావాలంటున్నారు. మనసు ఎన్ని ఆలోచించినా.. వాటి అమలులో అవాంతరాల కారణంగా మనిషి ఒత్తిడికి లోనవుతాడు. అయతే మనసుకు స్వేచ్ఛ దొరికితే అంతకు మించి సంతోషం ఉండదంటున్నారు. ఆర్థికంగా ఉన్నా.. భౌతికంగా బాగున్నా.. మానసిక స్వేచ్ఛ లేకపోతే మాత్రం క్షణాలు కూడా తట్టుకోలేడు.

రాజ్యాంగ హామీలు..
భారత రాజ్యాంగం పార్ట్‌–3 (ఆర్టికల్స్‌ 12–35)లో పౌరులకు సమానత్వం, మత స్వాతంత్య్రం, సాంస్కృతిక హక్కులు, విద్యా అవకాశాలు అందించింది. ముఖ్యంగా ఆర్టికల్స్‌ 19–22 ప్రకారం మాట్లాడే, భావాలు చెప్పే, సమావేశాలు నిర్వహించే, సంఘాలు ఏర్పాటు చేసే, వృత్తి ఎంపికలో స్వేచ్ఛలు ఇచ్చాయి. ఇవి పౌరులకు ఉన్నతమైన స్వేచ్ఛను అందిస్తున్నాయి.

హక్కులతోపాటు బాధ్యతల భారం
ఎలాంటి హక్కూ ఒంటరిగా ఉండదు. ప్రతి స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. మాటల హక్కు ఇతరులకు భంగం కలిగించకూడదు. ఎవరి మనసూ నొప్పించకూడదు. విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఇక సమావేశాలు సమాజ శ్రేయస్సుకు విఘాతం కలిగించకూడదు. సభ్యతా నియమాలకు కట్టుబడి, పరస్పర గౌరవంతో హక్కులు ఆస్వాదించాలి. పౌరుల వివేకం ఇక్కడే పరీక్ష అవుతుంది.

అసలు స్వేచ్ఛ ఇదే..
మెదడులో పుట్టే ఆలోచనల స్వాతంత్య్రమే నిజమైన స్వేచ్ఛ. బాహ్య ప్రభావాలు లేకుండా సొంత అభిప్రాయాలను వ్యక్తీకరించే వాతావరణం తప్పనిసరి. ఆలోచనలను కట్టిపడేసి మిగతావి ఇచ్చినా ఆ స్వేచ్ఛకు విలువ ఉండదు. భౌతిక ఆకర్షణల్లో మునిగిపోతే అసలు లాభం కోల్పోతాము.

స్వాతంత్య్ర పోరాటంలో జైలు బంధనాల్లో చిక్కుకున్న నాయకులు తమ మానసిక శక్తిని కోల్పోలేదు. ఇనుప గొలుసులు వారి ఆలోచనలను అడ్డుకోలేవు. జైలు నుంచే వారు ప్రజలకు సందేశాలు పంపారు. ఈ మనసు బలం వల్లనే ఉద్యమం విజయం సాధించింది. మనసు స్థిమితంగా ఉంటే అన్ని స్వేచ్ఛలు స్వయంచాలకంగా వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Oktelugu Epaper