Love Marriage: ఆ ప్రేమికులకు ఒకరంటే మరొకరు ప్రాణం.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతా ప్రేమించుకున్నారు. ఎంచక్కా చట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి విషయం ఇంట్లో తెలియడంతో పెద్దలు ఒప్పుకోలేదు. కానీ వారిని బతిమిలాడి ఎలాగొలో పెళ్లికి ఒప్పించారు. వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా సవ్వంగానే సాగింది. కానీ తర్వాతే అసలు కథ మొదలైంది. కాపురం మొదలుపెట్టినా అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు చేసుకున్నాయి. అనంతరం ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నారు. సీన్ కట్ చేస్తే అమ్మాయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన పావని, అదే మండలంలో పచ్చలమెట్ట ప్రాంతానికి చెందిన సాయి కొన్ని రోజుల క్రితం ప్రేమలో పడ్డారు. ఈ విషయం వారిరువురి ఇంట్లో తెలియడంతో పెళ్లి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. చివరకు ఎలాగో అలా పెద్దలను ఒప్పించి నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత మూడు నెలల పాటు వీరి కాపురం బాగానే సాగినా.. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
Also Read: రాజధాని విషయంలో జగన్ సైలెంట్.. అది భారీ స్కెచ్‌లో భాగమేనట..
దీంతో పావని తన పుట్టింటికి వచ్చేసింది. ఆమె ప్రస్తుతం కాకినాడలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. కాపురానికి రావాలని సాయి ఇటీవల పావనిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. సాయి మద్యానికి బానిసగా మారి భార్యను వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు పావనిని పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు.. పావని ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ క్రమంలో పావనిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అదే టైంలో అడ్డువచ్చిన అత్తపైన కూడా దాడి చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు.
తర్వాత గమనించిన స్థానికులు వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో పావని పరిస్థితి విషయమంగా ఉంది. ఆమె మెడపై ఎనిమిది కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె పరిస్థితి విషయమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పావననిని ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల పరిస్థితిపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
Also Read: మేడారం వెళ్లే భక్తులకు తీపికబురు.. మీ ఇంటి ముందుకే ఆర్టీసీ బస్సు సర్వీస్!
[…] Malavika Mohanan: క్రేజీ ముద్దుగుమ్మ ‘మాళవిక మోహన్’ ప్రైవేట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే, వైరల్ అవుతున్న ఆ ఫేక్ ఫొటో పై నటి మాళవిక మోహనన్ స్పందించింది. తాను కొన్ని నెలల క్రితం ట్విటర్ లో పోస్టు చేసిన ఫొటోను ఎవరో అసభ్యకరంగా మార్ఫ్ చేసి సర్క్యూలేట్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. […]