Tollywood Crazy Updates: టాలీవుడ్ లో టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెకర్ హరీశ్ శంకర్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా బన్నీతో కలిసి దిగిన ఓ ఫొటోను హరీశ్ షేర్ చేస్తూ ‘నీతో కలిసి సమయం గడపడం గొప్పగా ఉంటుంది. తగ్గేదే లే.. ఎందుకు తగ్గాలి ?’ అని ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. గతంలో వీరిద్దరు కలిసి ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ చేశారు. కాకపోతే అది ప్లాప్ అయింది.

మరో క్రేజీ అప్ డేట్ కి వస్తే.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 3. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తొలి లిరికల్ పాటను ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘విశ్వదాభిరామ.. ఎఫ్ 3 సాంగ్స్ హంగామా, షురూ రా మామా’ అనే క్యాప్షన్ పెట్టి.. తొలి పాట విడుదలపై యూనిట్ స్పష్టత ఇచ్చింది.
Also Read: ఆ హీరోయిన్ కోటి ఇస్తేనే ‘ఊ’ అంటుందట !

అలాగే లాస్ట్ అప్ డేట్ కి వస్తే.. సెన్సేషనల్ సాంగ్ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’కు మొదట తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పానని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య చెప్పారు. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఈ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన పలు విషయాలను గణేశ్ వెల్లడించారు.

ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అయినా ‘ఊ అంటావా..’ పాటకు కొరియోగ్రఫీ చేయనని ఎందుకు చెప్పాడో మరి. పాటలో బూతు చేసి భయపడి ఉంటాడు.
Also Read: మెగాస్టార్ కుమార్తె ‘శ్రీజ’ తన భర్త పై సంచలన పోస్ట్
[…] Allu Arjun: పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో అభిమానులు గుండెలు పగిలేలా రోధించారు. కన్నడలో ఎందరో స్టార్లు పుట్టుకొచ్చి.. రాజ్ కుమార్ వైభవాన్ని మరిచిపోయేలా చేస్తున్న తరుణంలో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మళ్ళీ రాజ్ కుమార్ ఫ్యామిలీనే కన్నడ నాట నెంబర్ వన్ గా నిలబెట్టాడు. అందుకే పునీత్ అంటే.. ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ. […]
[…] […]