spot_img
Homeకరోనా వైరస్Delta Omicron: డెల్టా, ఒమిక్రాన్ కలిసి మరో కొత్త వేరియంట్.. వినాశనం తప్పదా?

Delta Omicron: డెల్టా, ఒమిక్రాన్ కలిసి మరో కొత్త వేరియంట్.. వినాశనం తప్పదా?

Delta Omicron: కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ప్రపంచంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్ భయాలు ఇక అయిపోయాయి అనుకునే లోపే మరో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. దాంతో జనం ఇంకా భయాందోళన చెందే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఈ వేరియంట్స్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ హెచ్చరించింది. ఆ క్రమంలోనే ప్రపంచంలో భయానక పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి.

Delta Omicron
Delta Omicron

తాజాగా డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్స్ కలిసి మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీనిపేరు ‘డెల్ట్రాక్రాన్’. కాగా, ఈ వేరియంట్ తొలి కేసులు సైప్రస్‌లో నమోదయ్యాయి. ఈ డెల్టాక్రాన్‌ స్ట్రెయిన్‌‌ను సైప్రస్‌ యూనివర్సిటీ ఆఫ్ బయాలజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌, ల్యాబోరేటరీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మాలిక్యులర్‌ వైరాలజీ డీన్ లియోండియోస్‌ కోస్ట్రికిస్‌ గుర్తించారు. ఈ ఒమిక్రాన్, డెల్టా కో-ఇన్ఫెక్షన్‌ కేసులు సైప్రస్‌లో పుట్టుకొచ్చినట్లు స్పష్టం చేశారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ కాంబినేషన్స్ ఇందులో కనిపించాయని వివరించారు.

Also Read: ఒమిక్రాన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్?

ఈ కొత్త వేరియంట్‌కు డెల్టా వేరియంట్ తరహా జన్యు నేపథ్యం ఉందని, ఇందులో కొన్ని ఒమిక్రాన్‌ మ్యుటేషన్లను కనుగొన్నామని చెప్పారు. మొత్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌తో నే జనాలు హడలిపోతున్న ఈ సందర్భంలో మరోకొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దాంతో జనాలు మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు సైప్రస్‌లో ఒకేసారి 25 వరకు ఈ డెల్ట్రాకాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని లియోండియోస్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ డెల్టాక్రాన్‌ కొవిడ్ వేరియంట్ లక్షణాలు ఎటువంటివనే విషయమై ఇంకా స్పష్టత అయితే రాలేదు. దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇకపోతే సైప్రస్ మంత్రి మంత్రి హడ్జిపాండేలాస్ మాట్లాడుతూ.. ఈ వేరియంట్ విషయమై యూనివర్సిటీ నుంచి నివేదికలను తెప్పించుకున్నామని వివరించారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల భయపడాల్సిన పని లేదని, అయితే, దీనిపై పూర్తి అధ్యయనం తర్వాతనే స్పందిస్తామని చెప్పారు. ప్రజలకు నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు.

Also Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: సీఎంలతో మోడీ భేటి..దేశంలో సంపూర్ణ లాక్ డౌన్?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper