spot_img
Homeక్రీడలుIND vs AUS : చేపాక్ లో ఊహించని ఘటన.. ఆగిన ఆట.. సెక్యూరిటీకి ముచ్చెమటలు.....

IND vs AUS : చేపాక్ లో ఊహించని ఘటన.. ఆగిన ఆట.. సెక్యూరిటీకి ముచ్చెమటలు.. వీడియో

IND vs AUS : చెప్పులో రాయి.. చెవిలో జోరీగ ఇలా ఇబ్బంది పెడతాయో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే శతకారుడు దీనిపై ఒక పద్యమే రాశాడు.. ఇక ఇలాంటి అవాంతరమే చెన్నైలోని చేపాక్ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఎదురైంది. దీంతో మైదానం సెక్యూరిటీ గార్డ్ లకు చుక్కలు కనిపించాయి..

మూడో వన్డేలో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ కొనసాగుతుండగానే.. మైదానంలో అనుకోని అవాంతరం ఏర్పడింది.. దీంతో ఆటకు బ్రేక్ పడింది. సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఆ అవాంతరమేంటంటే.. చేపాక్ మైదానంలోకి దూసుకు వచ్చిన ఓ గ్రామ సింహం.. దీనివల్ల ఆట కొద్దిసేపు ఆగిపోయింది.. దానిని బయటకు వెళ్ళగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ప్రయాసలు పడ్డారు. ఆ సెక్యూరిటీ సిబ్బందిని ఆ గ్రామ సింహం మైదానం మొత్తం పరిగెత్తించింది. చివరకు ఆ గ్రామ సింహం మైదానం వీడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ సెక్యూరిటీ గాడ్స్ ను పరిగెత్తించిన ఆ గ్రామ సింహం అందరినీ నవ్వించింది.. కామెంట్రేటర్లైతే ” మైదానంలోకి పిలవకుండా ఒక అతిధి వచ్చిందంటూ” చలోక్తి విసిరారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతి వేసే ముందు గ్రామ సింహం మైదానంలోకి ప్రవేశించింది. ఆ కుక్కతో రవీంద్ర జడేజా కాసేపు ఆడుకున్నాడు. దాన్ని పట్టుకుంటున్నట్టు సైగలు చేసి భయపెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు కూడా కొంతగా కామెంట్లు చేస్తున్నారు. ” పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానంలోకి వచ్చాడని” ఒకరు అంటే… మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు ఆ శునకాన్ని పంపించారని మరికొందరు వ్యాఖ్యానించారు. మనుషులేనా.. కుక్కలు క్రికెట్ చూడొద్దా.. మరికొందరు కామెంట్స్ చేశారు.

మైదానం మొత్తం భారీ భద్రత ఉన్న నేపథ్యంలో ఆ గ్రామ సింహం ఎలా వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హెడ్ 33, మార్ష్ 47, క్యారీ 38 టాప్ స్కోరర్ లు గా నిలిచారు. పాండ్యా 3/44, కుల దీప్ యాదవ్ 3/56, అక్షర్ 2/57, సిరాజ్ 2/37 వికెట్లు తీశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper