Jemimah Rodrigues: నీ వల్ల కాదన్నారు. నువ్వు ఆడలేవన్నారు. నీ దగ్గర సత్తా లేదన్నారు. నీ సామర్థ్యం సరిపోడం లేదన్నారు.. జట్టుకు దూరంగా ఉండడం బెటర్ అన్నారు. ఆ మాటలు వింటుంటే ఆమెకు కన్నీళ్లు వచ్చాయి. బాధ అంతట వ్యాపించింది. ఏం చేయాలో తెలియలేదు. ఎవరిని అడగాలో అర్థం కాలేదు.. అన్నింటికీ దేవుడే ఉన్నాడని అనుకుంది. చివరికి ఆ దేవుడిని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చింది.
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్(127*) అదరగొట్టింది. సూపర్ సెంచరీతో టీమ్ ఇండియాకి గెలిపించింది.. ఈ సెంచరీ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ ఒక్కసారిగా సూపర్ వుమన్ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఆమె మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాలు సాధించింది. సెమీస్ దాకా ఆ జట్టు విజయ విహారం చేసింది. టీమ్ ఇండియాలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా 339 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని మరో జట్టు చేదించాలంటే కాస్త వెనుకడుగు వేసేది. కాని టీమిండియా అలా కాకుండా దుమ్మురేపింది. ముఖ్యంగా జెమిమా(Jmimah Rodrigues) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. అద్భుతమైన శతకంతో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అసలు సాధ్యం కాదనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేసి సత్తా చాటింది. రెండు తప్పులు మినహా.. మ్యాచ్ మొత్తం తన ప్రతాపాన్ని చూపించింది.
మ్యాచ్ గెలిచిన తర్వాత జెమిమా(Jmimah Rodrigues) తీవ్ర భావోద్వేగానికి గురైంది. విపరీతంగా ఏడ్చేసింది. ” నా దేవుడు నా యందు ఉన్నాడు. అతడి దయలేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ నాన్న నా వెంట ఉన్నారు. కోచ్ నన్ను నమ్మారు. ఆత్మీయులు అండదండగా నిలిచారు. గడిచిన నెల మొత్తం ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు మొత్తం అంత మాయ లాగా కనిపిస్తోంది. మూడో స్థానంలో వచ్చిన నేను ఈ స్థాయిలో ఆడతానని ఊహించలేదు. ఈ స్థానంలో నన్ను పంపిస్తారని ఐదు నిమిషాల ముందు చెప్పారు. అయితే జట్టు కోసం ఇంత పెద్ద ఇన్నింగ్స్ ఆడతానని అనుకోలేదు. ఇటీవల ఒక మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో భారత చట్టం గెలిపించాలని ముందుగానే అనుకున్నాను. ఫైనల్ దాకా తీసుకెళ్లాలని భావించాను. పర్సనల్ స్కోర్ గురించి ఆలోచించలేదు. మొత్తానికైతే పెద్ద స్కూలు చేసి జట్టును గెలిపిస్తానని అనుకున్నాను. వాస్తవానికి నాకు గత ప్రపంచకప్ లో అవకాశం కల్పించలేదు. ఆ విషయం నా పరిధిలో లేదు కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఈ క్షణం కోసం అదంతా జరిగిందని ఇప్పటికే అనుకుంటాను. ఈ టోర్నీలో ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. తీవ్రమైన ఆందోళనతో కలత చెందాను. మంచి ప్రదర్శన చేయాలని నాలో నేనే చెప్పుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లు అత్యంత పదునైన బంతులు వేశారు. వాటన్నింటికీ సరైన స్థాయిలో సమాధానం చెప్పాలని ముందుగానే అనుకున్నాను. అందువల్లే జట్టు గెలిచిన తర్వాత నా ఆనందాన్ని ఆపుకోలేకపోయాను. నా కన్నీటిని అధిగమించలేకపోయాను. హర్మన్ తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాను. మ్యాచ్ ముగిసే సమయంలో దూకుడు కొనసాగించాలని అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే నా ఆట తీరు ప్రదర్శించానని” జెమిమా(Jmimah Rodrigues) పేర్కొంది.
ఈ ప్రపంచ కప్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన జెమిమా(Jmimah Rodrigues) రెండుసార్లు డక్ అవుట్ అయింది. మరో రెండు సార్లు చెప్పుకునే స్థాయిలో స్కోర్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదవ వన్డేలో జట్టు ఎంపిక భాగంగా ఆమెను పక్కనపెట్టారు. అయితే న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మళ్లీ జట్టులోకి వచ్చింది. 55 బంతుల్లో 76 పరుగులు చేసింది. చివరి వరకు అజేయంగా నిలిచింది. అదే సెమీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం సూపర్ సెంచరీ తో తన స్టామినా నిరూపించుకుంది.