Name Astrology
Name Astrology: పేరులో ఏముంది అనుకుంటారు. కానీ కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు విభిన్నంగా ఉంటాయి. వారి వ్యక్తిత్వం వెరైటీగా ఉంటుంది. స్నేహానికి ప్రాణం ఇస్తారు. తమ అనుకున్న వారి కోసం ఎంత కష్టానికైనా వెనకాడరు. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు స్వచ్ఛంగా ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకోరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు.
నిజాయితీగా..
వీరికి నటించడం అసలు రాదు. లోపల ఒకటి బయటకి ఒకటి మాట్లాడటం వీరికి నచ్చదు. ఏదైనా సూటిగా చెబుతారు. తమ భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకోవడం వీరి నైజం. మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటారు. తమ మీద ప్రేమ చూపించే వారి పట్ల ఎంతో నిజాయితీగా ఉంటారు. వారితోనే జీవితాంతం ఉండేందుకు ఇష్టపడతారు.
అండగా నిలబడతారు
ఇతరులకు కష్టం వస్తే వారికి అండగా నిలబడతారు. వారి కష్టం తీరే వరకు ఎంత దాకా అయినా పోరాడతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా తమదైన శైలిలో దూసుకెళ్లడం వీరికి ఉన్న ప్రత్యేకత. సహజంగా వీరికి కోపం ఎక్కువగా రాదు. ఒకవేళ వస్తే అంత త్వరగా పోదు. కోపం నిగ్రహం కోల్పోతారు. ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండటం వీరి అలవాటు.
అందమైన రూపం
ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే గుణం కూడా వెరైటీగా ఉంటుంది. వీరు చూడటానికి కూడా అందంగా ఉంటారు. అందమైన మనసు కలిగి ఉంటారు. కుటుంబానికి విలువ ఇస్తారు. బంధుత్వానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో సహజంగానే వీరిని అందరు ఇష్టపడుతుంటారు. ఇలా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి గుణగణాలు డిఫరెంట్ గా ఉండటం గమనార్హం.