Parenting Tips: పిల్లలు ఏ వయసులో తల్లిదండ్రులకు దూరంగా పడుకోవాలి?

వెంటనే అలవాటు చేయకుండా నెమ్మనెమ్మదిగా అలవాటు చేస్తుండాలి. అకస్మాత్తుగా వేరుగా పడుకోండి అంటే వారికి కూడా కష్టంగా, భారంగా, బాధగా అనిపిస్తుంది. అందుకే ముందుగా ఒకరోజు పడుకోబెట్టండి.

Written By: Swathi, Updated On : June 6, 2024 10:27 am

Parenting Tips

Follow us on

Parenting Tips: పిల్లలతో తల్లిదండ్రులకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అదే విధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులతో బంధం ముడి పడుతుంది. ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తల్లిదండ్రులతోనే పడుకుంటారు. ఈ అలవాటు ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? కంటిన్యూగా మీతోనే పిల్లలను పడుకోబెట్టుకుంటే ఎటైనా వెళ్లాలి అనుకున్నప్పుడు ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే కొన్ని అలవాట్లు మీ పిల్లలకు తప్పనిసరిగా చేయాలి.

దూరంగా అలవాటు చేయాలి..
వెంటనే అలవాటు చేయకుండా నెమ్మనెమ్మదిగా అలవాటు చేస్తుండాలి. అకస్మాత్తుగా వేరుగా పడుకోండి అంటే వారికి కూడా కష్టంగా, భారంగా, బాధగా అనిపిస్తుంది. అందుకే ముందుగా ఒకరోజు పడుకోబెట్టండి. కాసేపు వారి పక్కన ఉండండి. ఆ తర్వాత వెళ్లండి. మళ్లీ లేస్తే వచ్చి పోతూ ఉండండి. ఇలా నెమ్మనెమ్మదిగా ఒంటరిగా పడుకోవడం అలవాటు చేయండి.

కథలు చెప్పి పడుకోబెట్టాలి..
వేరుగా పడుకోండి అని చెబితే మారం చేస్తారు. పడుకోమని మొండికేస్తారు. వారితో వారి గదికి వెళ్లి లైట్ ఆఫ్ చేసి, పడుకునే ముందు గుడ్‌నైట్ చెప్పండి. కాసేపు వారితోనే ఉండి కథలు చెప్తూనే ఉండండి. వారు పడుకున్నారు అని తెలిసిన తర్వాత వేరే గదిలోకి వెళ్లండి. ఇలా చేయడం వల్ల పిల్లలు త్వరగా నిద్రపోవడానికి అలవాటు పడతారు కానీ ఫోన్ ను మాత్రం అలవాటు చేయకండి.

ఏ వయసులో వేరుగా నిద్రించాలి?
8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పిల్లలు, తల్లిదండ్రులకు కాస్త దూరంగా పడుకోవడం అలవాటు చేసుకోవాల్సిందే. ఈ సమయంలో పిల్లలు పెద్దవారు అవుతుంటారు. అన్ని విషయాలు అర్థమవ్వడం ప్రారంభమవుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి నిద్రించడం వల్ల వారి మానసిక అభివృద్ధి కూడా త్వరగా పెరగదు. వారు బలమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోలేరు కాబట్టి వారిని వేరుగా పడుకోబెట్టాలి. నిర్ణయం తీసుకోవడం, సామాజిక ఆందోళన, ఆశించడం, స్వతంత్ర ప్రవర్తన లేకపోవడం, మెమరీ నష్టం, తక్కువ శక్తి, అలసట, ఊబకాయం, భవిష్యత్తులో నిద్ర సమస్యలు, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యలు వారి చుట్టు ముడతాయి.