Site icon OkTelugu

Vijay Wife Divorce News: విజయ్ భార్య డివోర్స్ తీసుకుంటే ఆమెకు భరణంగా ఎన్ని కోట్లు ఇవ్వాల్సి ఉంటుందో తెలుసా..?

Vijay Wife Divorce News

Vijay Wife Divorce News

Vijay Wife Divorce News: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా తలపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అతని నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇక తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయినప్పటికి అవి అంత పెద్ద సక్సెస్ లను సాధించలేదు. దాంతో ఆయన తెలుగు పెద్దగా మార్కెట్టు క్రియేట్ చేసుకోలేకపోయాడు. అయిన కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం అతనికి ఉన్న భారీ క్రేజ్ దక్కింది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక రీసెంట్ గా విజయ్ భార్య సంగీత విజయ్ మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన భర్త వేరే ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని అందువల్ల తనకు విడాకులు కావాలి అంటూ కోర్టును ఆశ్రయించింది. వాళ్లకు పెళ్లైన 26 సంవత్సరాల తర్వాత విడాకులు కోరడం అనేది మామూలు విషయం కాదు. ఇక విజయ్ కొన్ని రోజుల నుంచి అసలు ఇంటికి రావడం లేదంటు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆ హీరోయిన్ దగ్గరే ఉంటున్నాడు అంటూ ఆమె కామెంట్లు చేసింది… అందుకే తనకి విడాకులు కావాలంటూ కామెంట్స్ చేసింది. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పిన వినేదే లేదు అంటూ సంగీత తన భర్త నుంచి విడాకులు కావాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది.

Also Read: మొదలైన ‘ధురంధర్ 2’ , ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఏ సినిమాకు ఎక్కువ గ్రాస్ ఉందంటే!

విజయ్ టివికె అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఈ సంవత్సరం తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇది ఆయనకు భారీగా నష్టాన్ని మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక విజయ్ ఈ విషయంలో తన భార్యకి సర్ది చెప్పి విడాకుల గొడవ నుంచి తప్పించుకుంటాడా?

లేదంటే తను నిజంగానే వేరే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నానని ఓపెన్ గా చెప్పి తన భార్య కి విడాకులు ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సంగీత కనక తన భర్త విజయ్ నుంచి విడాకులు తీసుకుంటే తనకు భరణంగా విజయ్ ఆస్తి లో సగభాగాన్ని ఇవ్వాల్సి ఉంటుందంటూ సంగీత తరపు న్యాయవాదులు సైతం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ప్రస్తుతం విజయ్ కి దాదాపు 4వేల కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయి. విడాకులు తీసుకుంటే మాత్రం అందులో రెండువేల కోట్ల ఆస్తులు సంగీత పేరు మీదకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి వీళ్ళ గొడవ ఎక్కడి దాకా వెళుతుంది ఈ విషయం మీద ఎవరు ఎలా స్పందిస్తారు అనేది…

Exit mobile version