Site icon OkTelugu

Rajamouli Puri And Jagannadh: పూరి జగన్నాథ్ కథ రాసిస్తే రాజమౌళి డైరెక్షన్ చేశాడా..? ఇంతకీ హీరో ఎవరో తెలుసా..?

Rajamouli Puri And Jagannadh

Rajamouli Puri And Jagannadh

Rajamouli Puri And Jagannadh: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్…చాలా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి సక్సెస్ లను అందించాడు. ఒకరకంగా మహేష్ బాబు లాంటి హీరోని స్టార్ గా మార్చింది కూడా తనే కావడం విశేషం…విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు… అయితే ఒకానొక సందర్భంలో పూరి జగన్నాధ్ రాసిన ఒక కథ రాజమౌళి కి నచ్చి దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడట.

Also Read: మొదలైన ‘ధురంధర్ 2’ , ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఏ సినిమాకు ఎక్కువ గ్రాస్ ఉందంటే!

అప్పట్లో ఈ న్యూస్ పెద్దగా బయటికి రాలేదు కానీ పూరి జగన్నాథ్ కథ రాజమౌళికి బాగా నచ్చడంతో తను కావాలనే ఆ కథను తీసుకున్నారట. జూనియర్ ఎన్టీఆర్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఆయన్ని పెట్టి ఆ సినిమా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కిందట. సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే రాజమౌళి పూరి జగన్నాథ్ ఇద్దరు మంచి స్నేహితులు…

ఇక పూరి మార్క్ పంచ్ డైలాగులకు కథ కి రాజమౌళి డైరెక్షన్ చేస్తే ఎలా ఉండేదో మన ఊహించుకోవచ్చు. ఒకవేళ పాజిబిలిటీ ఉంటే ఆ సినిమాని ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి కి బాగా నచ్చిన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ గారే అంటూ జక్కన్న చెబుతూ ఉంటాడు.

పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్ కూడా తనకు బాగా ఇష్టమని వీలైతే తన దగ్గర ఒక రోజు అసిస్టెంట్ గా పని చేయాలని ఉందని ఓపెన్ గా రాజమౌళి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి… ఇక ప్రస్తుతం రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నాడు…

Exit mobile version