https://oktelugu.com/

Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?

Vikram Thangalaan: పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'తంగలన్ ' సినిమాతో మరోసారి తను ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 6, 2024 / 10:23 AM IST

    Vikram Thangalaan Movie New Release Date

    Follow us on

    Vikram Thangalaan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయాలి అది ఒక్క విక్రమ్ వల్లే సాధ్యం అవుతుంది…ఇక ఇప్పటివరకు తన కెరియర్ లో చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక ప్రయోగాత్మకమైన సినిమానే కావడం విశేషం… అందుకే ఆయన నుంచి ప్రేక్షకులు ప్రతిసారి ఒక డిఫరెంట్ అటెంప్ట్ ను కోరుకుంటూ ఉంటారు. ఇక ఆయన కూడా తన అభిమానులను ప్రేక్షకులను నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతోనే కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    అయితే ఆతను చేసిన సినిమాలు ఎక్కువ శాతం ప్లాపులుగా మిగిలినప్పటికీ ప్రయోగాలు చేయడం మాత్రం ఆపడం లేదు. ఇక అలాంటి ఒక సరికొత్త ప్రయోగంతో మరోసారి విక్రమ్ మన ముందుకు రాబోతున్నాడు. పా రంజిత్(Pa Ranjith) డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తంగలన్'(Thangalaan) సినిమాతో మరోసారి తను ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత సమ్మర్ కి రిలీజ్ అవుతుందని చెప్పారు.

    Also Read: Pawan Kalyan: చిరంజీవి కి జరిగిన అవమానానికి పవన్ కళ్యాణ్ రివెంజ్ తీర్చుకున్నారా..?

    ఇక ప్రస్తుతం సమ్మర్ కూడా ముగిసిపోయింది. దాంతో ఈ సినిమా ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. కానీ ఇప్పటికే దసరకి ఎన్టీఆర్(NTR), రజనీకాంత్(Rajinikanth) లాంటి స్టార్ హీరోలు ముందుగానే కర్చీఫ్ వేసుకొని ఉన్నారు.

    Also Read: Dhee Judge: బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఢీ జడ్జ్… ఆ నురగ కరిగిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్!

    కాబట్టి ఈ సినిమా దసరకి రిలీజ్ అయితే మాత్రం భారీగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆగస్టు ఎండింగ్ లో గాని, సెప్టెంబర్ స్టార్టింగ్ లో గాని ఈ సినిమాని రిలీజ్ చేసుకుంటే మంచిది అంటూ సినిమా పండితులు ఈ సినిమా మేకర్స్ కి సలహాలు ఇస్తున్నారు. చూడాలి మరి విక్రమ్ చాలా అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఆయనకి ఎలాంటి విజయాన్ని సాధించి పెడుతుంది అనేది…