Homeలైఫ్ స్టైల్Gas subsidy not received solution: గ్యాస్ సబ్సిడీ రావట్లేదా..? అయితే ఇలా చేయండి..

Gas subsidy not received solution: గ్యాస్ సబ్సిడీ రావట్లేదా..? అయితే ఇలా చేయండి..

Gas subsidy not received solution: గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఈ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం వారి వివరాలు సరిగ్గా లేకపోవడమే అని తెలుస్తోంది. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టింది. గ్యాస్ సబ్సిడీ పొందాలనుకునేవారు ఈ కేవైసీ ని తప్పనిసరిగా చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి. అయితే ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రత్యేకంగా సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మొబైల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

LPG గ్యాస్ కనెక్షన్ విషయంలో కొన్ని పొరపాటు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సరైన లబ్ధిదారుడికి సబ్సిడీ ఫలితాలు అందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా డూప్లికేట్ లేదా నకిలీ కనెక్షన్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి వినియోగదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని.. ఈ ఆధార్ ను అప్డేట్ అయ్యేలా చూసుకోవాలని తెలిపింది. ఈ కేవైసీ చేసుకో లేకపోతే గ్యాస్ కనెక్షన్ కు వచ్చే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని తెలుపుతున్నారు.

Also Read: ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ లో పెట్టుబడులు కరెక్టేనా? ఇవి ఎవరికి ఉపయోగం?

అయితే ఈ కేవైసీ పూర్తి చేయడానికి ఒకప్పుడు ప్రత్యేకంగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని అంటున్నారు. ఇంట్లోనే మొబైల్ ద్వారా ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవచ్చని తెలుపుతున్నారు. ముందుగా మీ గ్యాస్ కనెక్షన్ ఏ కంపెనీలో గుర్తించి.. దానికి సంబంధించిన Aadhar face RD యాప్ ను ఉపయోగించాలి. P ఫేస్ athentic ద్వారా ఆధార్ ధ్రువీకరణ జరుగుతుంది. దీంతో ప్రత్యేకంగా ఫింగర్ ప్రింట్ లేదా బయోమెట్రిక్ అవసరం ఉండదు. దీనిని చేయాలంటే ముందుగా ఎల్పిజి కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదే మొబైల్లో ఫేస్ ఆర్ డి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో ఈ కేవైసీ లేదా ఆధార్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. స్క్రీన్ పై చూపిన విధంగా ముఖాన్ని స్కాన్ చేసుకోవాలి. ఫేస్ ధ్రువీకరణ జరిగితే ఈ కేవైసీ పూర్తి అవుతుంది.

ఎల్పిజి గ్యాస్ కలెక్షన్ కు సంబంధించి ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఇటీవలే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారు సైతం ఈ కేవైసిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజెన్సీ నుంచి ఈ కేవైసీ సంబంధించిన మెసేజ్ వచ్చినవారు తప్పనిసరిగా వీటిని పూర్తి చేయాలి. అయితే వినియోగదారులు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఎల్పిజి టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 నెంబర్ కు కాల్ చేసి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించవచ్చు. ఈ ఈ కేవైసీ ప్రక్రియను మార్చి 31 లోగా చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు తెలుపుతున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version