Site icon OkTelugu

Dhurandhar 2 Advance Bookings Overseas: మొదలైన ‘ధురంధర్ 2’ , ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఏ సినిమాకు ఎక్కువ గ్రాస్ ఉందంటే!

Dhurandhar 2 Advance Bookings Overseas

Dhurandhar 2 Advance Bookings Overseas

Dhurandhar 2 Advance Bookings Overseas: ప్రతీ సంక్రాంతికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడం సర్వ సాధారణమే, ఇందులో గొప్ప ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి లేదు. కానీ సంక్రాంతికి కాకుండా, ఉగాదికి రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలు విడుదల అవ్వడం అనేది ఈమధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటి అరుదైన ఘటనకు ఈ నెల 19 వేదిక కాబోతుంది. కన్నడ స్టార్ హీరో యాష్(Rocking Star Yash) నటించిన ‘టాక్సిక్'(Toxic) , రణవీర్ సింగ్(Ranveer Singh) నటించిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా ‘ధురంధర్ 2 ‘ చిత్రం కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే గత ఏడాది విడుదలైన ‘ధురంధర్ ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది కాబట్టి.

నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం తో పార్ట్ 2 పై అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే మొదలయ్యాయి . నార్త్ అమెరికా లో గడిచిన 24 గంటల్లో ‘ధురంధర్ 2 ‘ చిత్రానికి 13 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, ‘టాక్సిక్’ చిత్రానికి కేవలం 3 వేల 329 డాలర్లు మాత్రమే వచ్చింది. ‘ధురంధర్ 2’ చిత్రానికి 113 లొకేషన్స్ లో 154 షోస్ షెడ్యూల్ చేయగా 768 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా ‘టాక్సిక్’ చిత్రానికి 71 లొకేషన్స్ కి గాను 109 షోస్ షెడ్యూల్ చేయగా, కేవలం 173 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ రెండు సినిమాల మధ్య ఏ రేంజ్ గ్యాప్ ఉందో మీరే చూడండి.

‘ధురంధర్ 2’ కి కనీసం దరిదాపుల్లో కూడా లేకుండా పోయింది ‘టాక్సిక్ ‘ చిత్రం. ఓవర్సీస్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే , ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ‘టాక్సిక్ ‘ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా ‘ధురంధర్ 2’ ని తట్టుకోవడం కష్టం. ఇక నెగటివ్ టాక్ వస్తే ఏ ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ రెండు చిత్రాల్లో చివరిగా ఏ సినిమా పై చెయ్యి సాధించబోతుంది ?, ఎవరు గెలవబోతున్నారు అనేది.

Exit mobile version