https://oktelugu.com/

Animal Movie: అనిమల్ సినిమాను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో…

Animal Movie: సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రన్బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వచ్చిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 6, 2024 / 10:29 AM IST

    Bollywood star hero who missed Animal movie

    Follow us on

    Animal Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లు అందుకోవడం అనేది మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఆ ఒక్క సినిమా వల్లే హీరోల కెరియర్లు తారుమారవుతూ ఉంటాయి. ఇక ఫ్లాపుల్లో ఉన్న హీరో ఆ ఒక్క సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధిస్తుంటే, అప్పటివరకు సూపర్ సక్సెస్ లో ఉన్న హీరో ఆ ఒక్క సినిమాని వదిలేయడం వల్లే వరుస ప్లాపులను కూడా మూట గట్టుకోవాల్సి వస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రన్బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వచ్చిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటన అద్భుతంగా ఉండటమే కాకుండా తనకంటూ ఒక సపరేటు ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డివంగా ఈ సినిమాని మొదట షాహిద్ కపూర్(Shahid Kapoor) తో చేయాలని అనుకున్నాడట.

    Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?

    ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తీసిన ‘అర్జున్ రెడ్డి ‘ సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో షాహిద్ కపూర్ ను హీరోగా పెట్టి చేశాడు. కాబట్టి అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరోసారి ‘అనిమల్’ సినిమాని కూడా తనతో చేయాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మధ్యలో రన్బీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాని తనతో చేయాలని సందీప్ ని కోరడంతో సందీప్ ఆ ప్రాజెక్టుని రన్బీర్ కపూర్ తో తీసి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.

    Also Read: Telugu Directors: తెలుగులో ఈ యంగ్ డైరెక్టర్స్ ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్స్ గా మారబోతున్నారా..?

    అయితే ఈ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి గత సంవత్సరం రిలీజ్ అయి భారీ సక్సెస్ లను అందుకున్న సినిమాల్లో అనిమల్ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. ఇక మొత్తానికైతే షాహిద్ కపూర్ దక్కించుకోవాల్సిన హిట్ సినిమాని రన్బీర్ కపూర్ తన్నుకు పోయాడనే చెప్పాలి…ఇక వీళ్ళ కాంబో లో అనిమల్ కి సీక్వెల్ గా ‘అనిమల్ పార్క్ ‘ సినిమా కూడా తొందర్లోనే రాబోతుంది…