Site icon OkTelugu

Deverakonda Rashmika Mandanna Marriage: విజయ్ దేవరకొండ – రష్మిక మందాన జంటకి దిష్టి తగిలిందా..? అందుకే రష్మిక కి అలా అయిందా..?

Deverakonda Rashmika Mandanna Marriage

Vijay Deverakonda And Rashmika Mandanna Marriage Photos

Deverakonda Rashmika Mandanna Marriage: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ఉండే రిలేషన్ షిప్ ని సైతం ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. లేకపోతే మాత్రం సినిమా ఏదో వచ్చింది ఏదో నడుస్తుంది అనే ధోరణిలోనే ఉంటుంది తప్ప ఆ సినిమాని ప్రేక్షకుడి ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడు… ఇక ఆన్ స్క్రీన్ మీద చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ చేసిన నటీనటులు విజయ్ దేవరకొండ – రష్మిక మందాన కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలను చేశారు. ఇప్పుడు మూడో సినిమా కూడా చేస్తున్నారు. ఇక రీసెంట్ గా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లు పెళ్లి బంధంతో ఒకటవ్వడంతో వాళ్ల అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

పెళ్లయ్యేంత వరకు కూడా పెళ్లి విషయాన్ని ఎక్కడ బయటపడకుండా చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేసుకుంటూ వచ్చిన వీళ్లు పెళ్లి తర్వాత కలిసి వాళ్ళ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా వైరల్ గా మారారు. దానికి తోడుగా రీసెంట్ గా మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీని కలిసి అతనితో ఫోటో దిగారు.

ఇక ఇదిలా ఉంటే రష్మిక మందానికి కొంచెం ఫీవర్ వచ్చిందట. వీళ్ళిద్దరు చూడచక్కగా ఉన్నారని అనుకోవడంతో కొంతవరకు ఆమెకు దిష్టి తగిలిందని అందువల్లే ఆమెకు ఫీవర్ వచ్చిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రష్మిక మందాన ఇవన్నీ నమ్ముతుంది. కనుదిష్టి అనేది చాలా బ్యాడ్ అంటూ ఆమె గతంలో కొన్ని మాటలైతే చెప్పారు…

దానివల్లే పెళ్లి అయ్యేంత వరకు కూడా వాళ్ళ పెళ్లి విషయాని ఎక్కడ బయట చెప్పకుండా దాచారు. కలిసి బయట ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఎట్టకేలకు తనకు దిష్టి తగిలి ఫీవర్ రావడంతో ఆమె కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవాళ్ళ ఆమె నార్మల్ అయిపోయి ప్రేక్షకుల ముందుకు వచ్చారు…

Exit mobile version