Homeఆధ్యాత్మికంToday horoscope in telugu .1.3.2026 : ఈ నాలుగు రాశుల వారి ఇంట్లో ఈరోజు...

Today horoscope in telugu .1.3.2026 : ఈ నాలుగు రాశుల వారి ఇంట్లో ఈరోజు ధన ప్రవాహం..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో నాలుగు రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇతరులకు డబ్బు అప్పుగా ఇస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈరోజు ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. ప్రత్యర్థుల బెడద తొలగిపోతుంది. దీంతో వీరి వ్యాపార అభివృద్ధికి ఆటంకాలు లేకుండా ఉంటాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు తోటి వారి సహాయం తీసుకుంటారు. అధికారుల మద్దతు ఉండడంతో కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు రాజకీయాల్లో ఉంటే వీరికి ప్రజల మద్దతు ఉంటుంది. అన్నీ కలిసి రావడంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహార పద్ధతులను మార్చుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగాల్సి వస్తే మౌనంగా ఉండడమే మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీటితో అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. దీంతో వీరి వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు అనుకున్న రంగాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఇదే మంచి సమయం. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. వ్యాపారులకు తోటి వారి మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రుల సలహాతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version