Homeక్రీడలుVaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ: గ్రేట్ బుడ్డోడా.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నైవాళ్లు...

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ: గ్రేట్ బుడ్డోడా.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నైవాళ్లు తడబడిన చోట తగలబెట్టేశాడు

Vaibhav Suryavanshi : అతని వయసు పోరగాళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. క్లాస్ రూములలో బ్లాక్ బోర్డుల వైపు చూస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు.. పరీక్షలు రాసి పై తరగతులకు వెళ్తున్నారు. అతడు మాత్రం మైదానంలోనే తన యుక్త వయసును గడుపుతున్నాడు. పుస్తకాలకు బదులుగా బంతులతో.. పాఠాలకు బదులుగా బ్యాట్లతో.. పరీక్షలకు బదులుగా బ్యాటింగ్ తో సహవాసం చేస్తున్నాడు. అతడి కష్టం వృధా పోలేదు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. ఏ ముహూర్తంలో అయితే అతడి తల్లిదండ్రులు సూర్య […]

Vaibhav Suryavanshi : అతని వయసు పోరగాళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. క్లాస్ రూములలో బ్లాక్ బోర్డుల వైపు చూస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు.. పరీక్షలు రాసి పై తరగతులకు వెళ్తున్నారు. అతడు మాత్రం మైదానంలోనే తన యుక్త వయసును గడుపుతున్నాడు. పుస్తకాలకు బదులుగా బంతులతో.. పాఠాలకు బదులుగా బ్యాట్లతో.. పరీక్షలకు బదులుగా బ్యాటింగ్ తో సహవాసం చేస్తున్నాడు. అతడి కష్టం వృధా పోలేదు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. ఏ ముహూర్తంలో అయితే అతడి తల్లిదండ్రులు సూర్య వంశీ అని పేరు పెట్టారో.. ఆ పేరుకు తగ్గట్టుగానే భగభగ మండుతున్నాడు.

గత సీజన్లో రాజస్థాన్ జట్టు తరఫున ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యవంశీ.. తన స్టామినా నిరూపించుకున్నాడు. పరుగుల వరద పారించి సునామీ సృష్టించాడు. బుడ్డోడు కదా.. పైగా వేడి రక్తంతో ఉంటాడు.. ఇదంతా కూడా పాలపొంగు అని అందరూ అనుకున్నారు.. కాదు కాదు నేను చూపించిన శాంపిల్ మాత్రమే.. అసలు మాస్ లోపల ఉంది.. అది లోపల టన్నులకు మించి ఉందని నిరూపిస్తున్నాడు సూర్యవంశీ.

గౌహతిలో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఏకంగా 15 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఫోర్లు.. సిక్సర్లతో గౌహతి మైదానాన్ని హోరెత్తించాడు. బుడ్డోడు కదా అని చెన్నై బౌలర్లు ఉదారత చూపించలేదు. పదునైన బంతులు వేశారు. కఠినమైన ప్రాంతాలలో బంతులను విసిరేశారు. అయినప్పటికీ వైభవ్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. మీరు వేయండి.. నేను కొడతాను అంటూ సింహబలుడి మాదిరిగా ఎదురుదాడి చేశాడు.. చెన్నై బౌలర్లకు ఏమాత్రం కోలుకునే అవకాశం.. వికెట్లు తీసే అవకాశం ఇవ్వలేదు.

గత ఏడాది మైదానంలో సునామీ సృష్టించిన వైభవ్.. ఈసారి 2.0 లోడింగ్ అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విభిన్నమైన గౌహతి మైదానంలోనే అతడు ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తే.. ప్లాట్ పిచ్ మీద ఎలా రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇటీవల కాలంలో అండర్ 19 వరల్డ్ కప్.. అంతకు ముందు జరిగిన టోర్నీలలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు వైభవ్. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు వైభవ్.. అందులో నాలుగు ఫోర్లు ఉంటే.. ఐదు సిక్సర్లు ఉన్నాయి. దీనిని బట్టి అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అతడు చేసిన 52 పరుగులలో.. 50 రన్స్ కేవలం బౌండరీల ద్వారా మాత్రమే వచ్చాయి. వైభవ్ చూసేందుకు బుడ్డోడు మాదిరిగా కనిపించవచ్చు.. అదేదో సినిమాలో చెప్పినట్టు అతడు ఆటంబాంబ్. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో గౌహతి మైదానంలో అతడు అదేవిధంగా పేలాడు. ఇక మునుముందు చాలా మ్యాచులు ఉన్నాయి. ఈ ప్రకారం అతడు ప్రతి మ్యాచ్లో విస్పోటనం సృష్టించడం.. అభిమానులకు క్రికెట్ మజా అందించడం నూటికి నూరు శాతం ఖాయం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper