Contract Employees
Contract Employees : ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగల నియామకం కన్నా.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను రిక్రూట్ చేస్తున్నాయి. దీంతో ఆదాయం మిగలడంతోపాటు, ఇతర అలవెన్సులు చెల్లించే అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వాలు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే తెలంగాణలో ఏళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో రెగ్యులరైజ్ చేసింది. ఈమేరకు జీవో 16 జారీ చేసింది. దీంతో 8 వేలకుపైగా ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంచలన తీర్పు వెల్లడించింది. జీవో 16 చెల్లదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. దీంతో ఇప్పటికే రెగ్యులర్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అమయోమయంలో పడింది. తాము కూడా రెగ్యులర్ అవుతామని ఎదురు చూస్తున్న వారి ఆశలు ఆవిరాయ్యయి.
8 వేల మంది రెగ్యులరైజ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం విద్య, వైద్య శాలఖలతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేయాలని నిర్ణయించింది. రాత్రి జీవో ఇచ్చి.. తెల్లవారే సరికి రెగ్యులరైజ్ చేసింది. ఇలా వివిధ శాఖల్లోని 8 వేల మంది రెగ్యులర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో 16ను నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకింది. ఇది నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడింది. రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఆరోపించింది. ఈమేరకు జీవో 16ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదోప వాదనల అనంతరం హైకోర్టు జీవో 16ను కొట్టివేసింది.
రెగ్యులరైజ్ అయినవారిలో టెన్షన్..
హైకోర్టు జీవో 16ను కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన 8 వేల మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతా హ్యాపీ అనుకున్న సమయంలో కోర్టు తీర్పుతో టెన్షన్ పడుతున్నారు. తమ భవిష్యత్ ఏంటని, రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆందోళన చెందుతున్నారు. రెగ్యులరైజ్ అయిన వారిని అలాగే కంటిన్యూ చేస్తారా లేక కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణిస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు తాము కూడా జీవో 16 ప్రకారం రెగ్యులర్ అవుతామని ఎదురు చూస్తున్న కాంట్రక్టు ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి.
రేవంత్ సర్కార్‌దే తుది నిర్ణయం..
గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ఆధారపడి ఉంది. 8 వేల మందిని కొనసాగిస్తారా లేక కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు ఏమైన ప్రత్యేక కోటా కేటాయిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా అంతా సంతోషంగా ఉన్న సమయంలో కోర్టు తీర్పు రెగ్యులర్ అయిన ఉద్యోగులపాలిట శాపంగా మారింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The telangana high court has given a sensational verdict regarding contract employees
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com