MLC Theenmar Mallanna : కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్వపక్షంలో విపక్షంలా మారాడు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప‍్పటి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా వెలుగులోరి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది. దీంతో ఆయన బీజేపీలో చేరారు. తర్వాత బయటకు వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్లను కాదని తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చి గెలిపించింది. కానీ, ఇప్పుడు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం వరంగల్‌లో నిర్వహించిన బీసీల సభకు హాజరై రెడ్డి సమాజికవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక తాజాగా కుల గణన నివేదికను తప్పు పట్టారు. లైవ్‌లోనే కులగణన పత్రాలను తగులబెట్టారు. అంతే కాకుండా బీసి కులగణన సర్వే రిపోర్ట్ ని ఉచ్చ పోసి తగల పెట్టాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది రెండ్లు ఆడుతున్న డ్రామా అంటు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో కుల గణనపై ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న మాత్రం సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…తాజాగా కులగణనపై తీవ్ర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
కేసీఆర్ సర్వేనే కరెక్ట్
ఓ యూట్యూబ్ చానెల్‌లో లైవ్‌లో కుల గణన నివేదికపై మాట్లాడని మల‍్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుల గణన పూర్తిగా బోగస్ అని మండిపడ్డారు. అది జానారెడ్డి సర్వే అని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వే వంద శాతం కరెక్ట్ అని తెలిపారు. కాంగ్రెస్ కులగణన రిపోర్టును ఉచ్చపోసి తగలబెట్టాలని దారుణంగా వా‍్యక్యానించారు. ఉచ్చపోస్తే కాలదు కాబట్టి వట్టిగా తగలబెడుతున్నానని లైవ్‌లోనే కాల్చారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలలెవరూ స్పందించలేదు. అంతా మౌనం వహిస్తున్నారు.