Minister Ponnam Prabhakar : కరీంనగర్లో మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కులగణనపై రెండు పార్టీలు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. మైనార్టీలను బీసీలలో కొత్తగా చేర్చలేదని ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల గణన దరఖాస్తులను భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు పంపినట్టు పొన్నం వివరించారు. ” కులగణనలో ముందుగా మీరు పాల్గొనండి. ఆ తర్వాత మాట్లాడండి. బలహీన వర్గాలకు న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా” అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. మీకు చేతకాకపోతే మూసుకొని ఉండండని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనపై భారతీయ జనతా పార్టీ నాయకులకు కుట్ర చేస్తున్నారని.. వారు సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
దమ్ముంటే కులగణన చేయాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి దమ్ముంటే కేంద్రంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే విధంగా చూడాలని డిమాండ్ చేశారు..” బీసీ సమాజం బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే బాధపడింది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ నినాదం అయిపోయింది. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నది. కవితకు అప్పుడప్పుడు జాగృతి గుర్తుకొస్తుంది. అది లేకపోతే బతుకమ్మను నెత్తికి ఎత్తుకుంటుంది. ఆమె ఒక ఆడబిడ్డ.. ఆమెను విమర్శించాలని నాకు లేదు. కాకపోతే వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలే ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందువల్లే మాట్లాడాల్సి వస్తోంది.. బీసీలకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో. కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక బీసీ వ్యక్తితో భర్తీ చేసింది. ఇంకా అనేక పదవులు ఇచ్చింది. మిగతా పార్టీలు అలా చేయగలవా అంటూ” పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అయితే ఈ సమావేశం సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఆగ్రహంగా మాట్లాడటం.. మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. గులాబి పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో తెగ సందడి చేస్తోంది. తెలంగాణ మంత్రి మీడియా ప్రతినిధులపై తొక్కుతున్న చిందులు చూడండి అంటూ భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను తెగ ప్రచారం చేస్తోంది.
‘ఎవడా హౌలాగాడు.. ఎవరయ్యా ఆ క్రాక్ ఫెలో.. మెంటల్’
మీడియా ప్రతినిధులపై బూతులతో రెచ్చిపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి హోదాలో ఉండి, ఇలాగేనా మాట్లాడేది? అంటూ జర్నలిస్టుల ఫైర్#PonnamPrabhakar #Congressparty#telanganastate pic.twitter.com/IkwOi3jwy6— Anabothula Bhaskar (@AnabothulaB) February 11, 2025