Nikhil: హ్యాపీ డేస్ చిత్రంలో సెకండ్ హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddarth), ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ, ‘స్వామి రారా’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకొని, అక్కడి నుండి ఆయన తన కెరీర్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇంత దూరం దూసుకొచ్చాడు. నిఖిల్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో ‘కార్తికేయ’ సిరీస్ ప్రత్యేకం. ఈ సిరీస్ నిఖిల్ తీసుకొచ్చిన ఫేమ్ మామూలుది కాదు. ఆయనకంటూ ఇండస్ట్రీ లో ఒక స్థిరమైన మార్కెట్ ని తెచ్చిపెట్టిన సినిమాలు ఇవి. ముఖ్యంగా ‘కార్తికేయ 2’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కేవలం మన టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా, పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపేసింది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు మొండేటి(Chandu Mondeti) నే, నేడు నాగ చైతన్య తో ‘తండేల్'(Thandel Movie) వంటి భారీ హిట్ ని కొట్టి ఇండస్ట్రీ ని షేక్ చేసి వదిలాడు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో డైరెక్టర్ చందు మొండేటి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కార్తికేయ సిరీస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas||), మహేష్ బాబు(Super star Mahesh Babu) గారి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఖలేజా’ చిత్రమంటే ప్రాణం. నేను తీసిన కార్తికేయ సిరీస్ ఐడియా పుట్టుకొచ్చింది ‘ఖలేజా’ చిత్రం నుండే’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కార్తికేయ 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘ఖలేజా’ చిత్రం లేకపోతే కార్తికేయ స్టోరీ ఐడియా నే వచ్చేది కాదని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
అంటే నిఖిల్ కెరీర్ లో 150 కోట్ల సినిమా ఉండడానికి పరోక్షంగా కారణం మహేష్ బాబే కదా, ఆయన వల్లే నిఖిల్ కి ఇంత లాభం చేకూరింది అంటూ సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’ చేస్తున్నాడు. పీరియాడికల్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆయనకు చాలా ఆశలు ఉన్నాయి. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నిఖిల్ కి ‘స్పై’ చిత్రం ద్వారా స్పీడ్ బ్రేకర్ పడింది. దీనితో ఆయన ఇక నుండి సినిమాల ఎంపిక విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కేవలం స్వయంభు మాత్రమే కాదు, రామ్ చరణ్(Globalstar Ramcharan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ది ఇండియా హౌస్'(The India House) అనే చిత్రం లో కూడా నిఖిల్ హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.