Hyderabad : వ్యాధి వచ్చిందంటే ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఈ రోజుల్లో చాలా మంది భయపడుతున్నారు. టెస్టులు, ట్రీట్‌మెంట్(Teatment) పేరుతో ఆస్పత్రులు వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల(Corporate Hospitals) బిల్లులు అయితే లక్షల్లోనే ఉంటున్నాయి. అందుకే చాలా మంది ప్రైవేటు ఆస్పత్రి అంటేనే హడలి పోతున్నారు. వ్యాధి భయం కన్నా ఫీజుల భయమే వారిని టెన్షన్ పెడుతోంది. చాలా ఆస్పత్రుల్లో ఠాగూర్ తరహా సీన్లు కూడా రిపీట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్(Hydarabad)లోని ఓ ఆస్పత్రి ఠాగూర్ సినిమా సీన్‌ను రిపీట్ చేసింది. చనిపోయిన రోగిరి రెండు రోజులు ట్రీట్‌మెంట్ చేసి లక్షల రూపాయల బిల్లు వేసింది. చివరకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించింది. అక్కకడకు వెళ్లాక అసలు విషయం తెలిసింది. రెండు రోజుల క్రితమే రోగి చనిరిపోయినట్లు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోలన చేశారు.
ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప(Kadapa) జిల్లాకు చెందిన సుహాసిని(26) కళ్లు తిరిగి పడిపోవడంతో నెల క్రితం మియాపూర్(Myapur)లోని ఓ హాస్పిటల్‌కు బంధువుల తీసుకువచ్చారు. చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో చివరకు డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో చేసేది లేక వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్‌కు తరలించగా.. సుహాసిని చనిపోయి రెండు రోజులైందని వెల్లడించారు. దీంతో ఆమె బంధులు షాక్ అయ్యారు.
శవానికే ట్రీట్‌మెంట్..
దీంతో రెండు రోజులు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు డబ్బుల కోసం శవానికి చికిత్స(Treatdment to dead body) చేసినట్లు డ్రామా ఆడారన్న విషయం అర్థమైంది. దీంతో బాధిత కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితం చనిపోయినా ఎందుకు సమాచారం ఇవ్వలేదని, ట్రీట్‌మెంట్ పేరుతో డ్రామాలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఇంత దిగజారుతారా అని నిలదీశారు.
మంత్రి సీరియస్..
శవానికి ట్రీట్‌మెంట్ చేసిన ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను చూసిన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha)సీరియస్ అయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఫిబ్రవరి 10న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మియాపూర్‌లోని ఆస్పత్రికి వెళ్లారు, అయితే సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. మీడియా అక్కడకు చేరుకోవడంతో మీడియాను అపి అధికారులను అనుమతించారు.