Naga Chaitanya And Sobhita: అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) మాట తీరు, అతని నడవడిక చూస్తే చాలా పరిణితి చెందిన అబ్బాయి, మంచి మనసున్న వ్యక్తి లాగా అనిపిస్తాడు. ఆయన చేసే పనులన్నీ కూడా జెంటిల్ మ్యాన్ ని తలపిస్తాయి. అవతల వ్యక్తులు ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా, చాలా కూల్ గా సమాధానం ఇచ్చే అతని తీరుని చూసి ఎవరైనా మెచ్చుకోవలసిందే. నాగ చైతన్య అంటే మనం ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నాం కాబట్టి, అతని గురించి ఒక క్లారిటీ ఉంది. కానీ ఆయన సతీమణి శోభిత దూళిపాళ్ల(Sobhita Dhulipala) గురించి మాత్రం ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కేవలం రెండు మాత్రమే. అత్యధిక శాతం ఆమె హిందీ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. మన మీడియా తో ఇంటరాక్ట్ అయిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. కానీ ఆమె గురించి కూడా పలు సందర్భాల్లో చూసి మంచి మనస్సు ఉన్న అమ్మాయి అని అందరికీ అర్థమైంది.
ఇకపోతే వీళ్లిద్దరు కలిసి నేడు ఒక కార్యక్రమం తలపెట్టారు. హైదరాబాద్ లో ఉండే సెయింట్ జ్యుడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ కి సతీసమేతంగా వెళ్లారు. అక్కడ పాపం క్యాన్సర్ కోసం బాధ పడుతున్న చిన్నారులకు సహాయం చేసి తమ గొప్ప మనసుని చాటుకున్నారు. కేవలం సహాయం అందించడమే కాదు, ఆ పిల్లలతో కలిసి చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకున్నారు. అంతే కాదు వాళ్ళతో కలిసి చిందులు కూడా వేశారు. అనంతరం వాళ్ళు కోరుకున్న బహుమతులను అందచేసి ఆ పసి బిడ్డలా ఆనందానికి కారణమయ్యారు. వాళ్ళతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ కాలం లో ఇలా ఎంత మంది సెలెబ్రిటీలు చేస్తున్నారు చెప్పండి?, రాజకీయాల్లోకి వచ్చే హీరోలకు మాత్రమే అకస్మాత్తుగా సేవా కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. కానీ నాగ చైతన్య మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తుంటాడు.
అందుకే అక్కినేని ఫ్యామిలీ లో నాగచైతన్య స్పెషల్ గా నిలిచాడు. ఆయన్ని కేవలం అక్కినేని వంశానికి సంబంధించిన హీరోలు మాత్రమే కాదు. ఇతర హీరోల అభిమానులు కూడా ఇష్టపడడానికి కారణం ఇదే. ఇలాంటి సింప్లిసిటీ ని చూసే నాగచైతన్య కి లక్షల్లో ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. ఆ పిల్లలతో కలిసి వీళ్లిద్దరు గడిపిన ఆ మధుర క్షణాలు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య నుండి పెళ్లి తర్వాత విడుదలైన ‘తండేల్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం నుండి ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఆయన, ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన తన కెరీర్ ని ఎలా మలుచుకోబోతున్నాడు అనేది.