spot_img
Homeజాతీయ వార్తలుTamil Nadu election results 2026 : తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌ వెనుకంజ..

Tamil Nadu election results 2026 : తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌ వెనుకంజ..

Tamil Nadu election results 2026 : తమిళనాడులో మళ్లీ పరిణామాలు మారిపోతున్నాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌కు తమిళనాడు ఓటరినాడి అందనట్లు అర్థమవుతోంది. అందరూ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలై ఆసక్తిగా చూస్తే.. తమిళనాడు ఫలితాలు అంతకు మించి ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ పార్టీ టీవీకే అనూహ్యంగా దూసుకుపోతోంది. 97 స్థానాల్లో లీడ్‌లోకి వచ్చింది. ఇక రెండో స్థానంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక అధికార డీఎంకే 49 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

తండ్రీ కొడుకు వెనుకంజ..
ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో సీఎం స్ఠాలిన్‌ 886 ఓట్లతో వెనుకబడ్డారు. టీవీకే అభ్యర్థి బాబు ముందంజలో ఉన్నారు. ఇక సీఎం తనకుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌ కూడా వెనుకబడడ్డారు. ఆయనపైనా టీవీకే పార్టీ అభ్యర్థి లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఇదే సమయంలో స్టాలిన్, ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరో 26 మంది మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు.

తిరుమలలో త్రిష పూజలు..
ఇదిలా ఉంటే కౌంటింగ్‌ కొనసాగుతున్న వేళ సినీనటి త్రిష తిరుమలకు వచ్చారు. విజయ్‌కు మద్దతుగా ఉన్నత్రిష తిరుమలలో టీవీకే విజయం సాధించాలని పూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత త్రిష–విజయ్‌ పెళ్లి చేసుకుంటారని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో టీవీకే ముందంజలో ఉండడం ఆసక్తి రేపుతోంది. పోలింగ్‌ రోజు కూడా త్రిష తాను ఓటు వేసిన తర్వాత విజయ్‌ పార్టీకి ఓటు వేసినట్లు తెలిసేలా ఒక ఫోటో ఇన్‌స్టాలో పోస్టు చేశారు. తాజాగా ఫలితాల రోజు తిరుమలలో పూజలు చేయడం ఆసక్తి రేపుతోంది.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper