Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇటీవల టీవీ9 సమ్మేళనంలో పాల్గొన్నారు. జాతీయ మీటింగ్ అది. హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది. మోడీ డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాదికి ఎక్కువ సీట్లు పెరుగుతాయని.. దక్షిణాదికి సీట్లు తగ్గుతాయని దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ రేవంత్ రెడ్డి గళమెత్తారు.
ఇప్పుడు దేశం మొత్తం 540 ఎంపీ సీట్లలో 130 సీట్లు దక్షిణ భారత్ లో ఉన్నాయి. ఇది 24 శాతానికి సమానం.. నార్త్ భారత్ లో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 225 పార్లమెంట్ స్థానాలున్నాయి. 41 శాతం సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 50 శాతం సీట్లు పెరిగితే.. ఉత్తరాదిలో,దక్షిణాదిలో అదేశాతం సీట్లు పెంచుతారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలా ఉత్తరాధిని సీట్లు పెరుగుతాయో అర్థం కావడం లేదు.
రేవంత్ రెడ్డి గారు ఇదేమి లెక్కలు.. జనం నవ్వుకుంటున్నారు. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.